Niharika : వైరల్ అవుతున్న మెగా డాటర్ న్యూ టాటూ.. ఏకంగా ఆ పార్ట్ మీద.. నిహారిక తన ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా షేర్ చేసిన పిక్స్ లో ఓ టాటూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది. నిహారిక ఈ టాటూని తన యాంకిల్ దగ్గర వేయించుకుంది. ఆకాశం పై నుంచి వర్షం కురుస్తున్నట్లుగా ఆ టాటూ ఉండటంతో.. మీ టాటూ బాగుందని మరి కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. By Anil Kumar 08 May 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Niharika Konidela Tattoo : మెగా డాటర్ నిహారిక ఇటీవలే తన భర్తకు విడాకులు ఇచ్చి ప్రెజెంట్ సింగిల్ లైఫ్ ని లీడ్ చేస్తోంది. సినీ రంగంలో మళ్ళీ రాణించాలని నిర్మాతగా మారి వరుస ప్రాజెక్ట్స్ చేస్తోంది. కేవలం నిర్మాతగానే కాదు, హీరోయిన్ గా ఈ మధ్యే మలయాళంలో ఓ సినిమాకి సైన్ చేసింది. ఇక నిహారిక నిర్మించిన కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతోంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే నిహారిక తాజాగా షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం ఓ ఫొటోలో నిహారిక టాటూ కనిపించడమే. అక్కడ టాటూ వేయించుకున్న నిహారిక నిహారిక తన ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా షేర్ చేసిన పిక్స్ లో నలుపు రంగు దుస్తుల్లో చేతిలో కాఫీ కప్ తో దర్శనమిచ్చింది. ఆ పిక్స్ కి 'హైలైట్ ఆఫ్ ద డే' అనే క్యాప్షన్ జోడించింది. ఈ ఫోటోను నటుడు ప్రియదర్శి తీసినట్లు పేర్కొంది. కాగా ఈ ఫొటోల్లో నిహారిక టాటూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది. నిహారిక ఈ టాటూని తన యాంకిల్ దగ్గర వేయించుకుంది. Also Read : అనిల్ రావిపూడికి వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో? ఆకాశం పై నుంచి వర్షం కురుస్తున్నట్లుగా ఆ టాటూ ఉండటంతో.. దాని అర్థం ఏంటో చెప్పమని నిహారికకు కొందరు నెటిజన్స్ ప్రశ్నిస్తుంటే.. మీ టాటూ బాగుందని మరి కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నిహారిక షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక నిహారిక సినిమాల విషయానికొస్తే.. తెలుగులో మంచు మనోజ్ సరసన 'వాట్ ద ఫిష్' అనే సినిమాలో నటిస్తోంది. అలాగే మలయాళ హీరో షేన్ నిగమ్ సరసన మద్రాస్ కారన్ అనే సినిమా చేస్తోంది. ఈ రెండు సినిమాలు ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) #niharika-konidela #niharika-tattoo మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి