Nigeria : పెళ్ళి మండపంలో ఆత్మాహుతి దాడి.. 18మంది మృతి..19మంది పరిస్థితి విషమం! నైజీరియా వీధులు మరోసారి ఎరుపెక్కాయి. వరుస ఆత్మాహుతి దాడుల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 42 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈశాన్య నైజీరియాలోని గ్వోజా నగరంలో మూడు వరుస పేలుళ్లు జరిగాయి. ఈ ఆత్మాహుతి బాంబర్లలో ఒక మహిళ కూడా ఉంది. By Trinath 30 Jun 2024 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి Nigeria Suicide Attack : ఆత్మాహుతి దాడులతో నైజీరియా (Nigeria) వణికిపోతోంది. ఒకదాని తర్వాత ఒకటిగా జరుగుతున్న ఆత్మాహుతి దాడుల్లో ఇప్పటివరకు 18 మంది చనిపోగా.. 42మందికి పైగా గాయపడినట్లు సమాచారం. వీరిలో 19 మంది పరిస్థితి విషమంగా ఉంది. మొదటి దాడి ఈశాన్య రాష్ట్రమైన బోర్నోలో జరిగింది. రెండో ఆత్మాహుతి దాడి కామెరూన్ సరిహద్దు ప్రాంతంలో జరిగింది. ఆత్మాహుతి బాంబర్లు వేర్వేరు చోట్ల వరుస దాడులకు పాల్పడ్డారని స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ తెలిపింది. గ్వోజా నగరంలో పెళ్ళి, అంత్యక్రియలు, ఆసుపత్రి లక్ష్యంగా ఆత్మాహుతి బాంబర్లు దాడులు (Bomber Kills) చేశారు. In Kenya, the youths buried one of their own. Ibrahim Kamau Wanjiku was only 19. Activists are demanding William Ruto’s resignation. Like Nigeria, Kenya has 3 major tribes, & at least 42 ethnic groups. But the youths are united in their grief. May Wanjiku’s soul Rest In Peace. 🕊 pic.twitter.com/H3NYyH6UVJ — NEFERTITI (@firstladyship) June 29, 2024 హృదయవిదారకం: చనిపోయిన వారిలో గర్భిణులు, చిన్నారులు ఉండడం తీవ్రంగా కలిచివేస్తోంది. మరోవైపు, గ్వోజా (Gwoza) లో సైన్యానికి మద్దతు ఇస్తున్న మిలీషియా సభ్యుడు ఈ ఘటనపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ భద్రతా పోస్ట్‌పై కూడా దాడి జరిగిందని.. ఈ ఘటనలో తన ఇద్దరు సహచరులు, ఒక సైనికుడు కూడా మరణించారని చెప్పారు. మరోవైపు ఈ దాడులకు ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. ఇక ఆత్మాహుతి దాడి చేసింది ఓ మహిళగా తెలుస్తోంది. ఉగ్రవాదుల అడ్డా: నిజానికి బోర్నో ఆఫ్ నైజీరియా చాలా ఉగ్రవాద గ్రూపులు (Terrorists Groups) యాక్టివ్‌గా ఉన్న ప్రాంతం. ఇక ఈ దాడి బోకోహరమ్‌పైనే జరిగినట్లు అనుమానిస్తున్నారు అధికారులు. ఇస్లామిక్ స్టేట్‌తో చేతులు కలపడం ద్వారా నైజీరియాలో బోకో హరామ్ ఉగ్రవాద పరిధి రోజురోజుకు పెరుగుకుంటూ పోతోంది. బోకోహరాం ఇప్పటి వరకు వేలాది మందిని దారుణంగా హత్య చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. బోకోహరమ్ ఇక్కడి ప్రజలను టార్గెట్ చేయడమే కాకుండా భద్రతా బలగాలపై భీకర దాడులకు పాల్పడింది. ప్రజలను కిడ్నాప్ చేసింది. సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దారుణాలకు ఒడిగట్టింది. పిల్లలను కూడా విడిచిపెట్టలేదు. నైజీరియాతో పాటు, బోకో హరామ్ నైజర్, ఉత్తర కామెరూన్‌లలో కూడా యాక్టివ్‌గా ఉంది. 2002లో ప్రారంభమైన బోకోహరాం 2015లో ఉగ్రవాద సంస్థ క్యాటగీరిలోకి వెళ్లింది. ఈ సంస్థ ఆత్మాహుతి బాంబులను తయారు చేయడమే కాకుండా ఇందులో పిల్లలను, మహిళలను బలి ఇస్తుంది. Also Read: కాంగ్రెస్‌కు షాక్.. ఎమ్మెల్యే రాజీనామా? #terrorists #nigeria #bomb-attack #gwoza మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి