ప్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ క్రెడిట్‌కార్డు యూజర్లకు షాక్‌, ఇకపై కార్డుకు కోత తప్పదా..!

యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డుల్లో ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ క్రెడిట్‌ కార్డుకు బ్యాంకింగ్ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు వివిధ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లో ఎక్కువ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లు ఎక్కువగా ఉండడంతో ఈ కార్డును తీసుకునేందుకు ఎందుకు మక్కువ చూపుతుంటారు. అయితే, ఈ కార్డ్‌పై ఉన్న బెనిఫిట్స్‌ను యాక్సిస్‌ బ్యాంక్‌ తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధనలు ఆగస్ట్‌ 12 నుంచి అమల్లోకి రానున్నట్లు యాక్సిస్ బ్యాంక్ తెలిపింది.

New Update
ప్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ క్రెడిట్‌కార్డు యూజర్లకు షాక్‌, ఇకపై కార్డుకు కోత తప్పదా..!

news-flipkart-axis-credit-card-shock-to-users-of-flipkart-axis-bank-credit-card-bank-remove-benefits

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై ఫ్లిప్‌కార్ట్‌తో పాటు మింత్రా ప్లాట్‌ఫామ్‌లో జరిపే లావాదేవీల్లో 5శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్యాష్‌బ్యాక్‌కు ఎలాంటి లిమిట్‌ లేదు. కానీ, సవరించిన నిబంధనలతో ఫ్లిప్‌కార్ట్, మింత్రా, ఫ్లైట్, హోటల్ పేమెంట్స్‌పై క్యాష్‌బ్యాక్‌లో మార్పులు చోటు చేసుకున్నది. క్యాష్‌బ్యాక్ ఎలిజిబిలిటీ నుంచి ప్రభుత్వ సేవలను బ్యాంకు తొలగించింది. ఇక ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్లైట్, హోటల్ పేమెంట్స్, మింత్రాలో షాపింగ్‌పై 1.5 శాతం మాత్రమే అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ వర్తించనున్నది.

వాటికి క్యాష్‌బ్యాక్ ఉండదని బ్యాంక్‌ ప్రకటన

ఇక వార్షిక చెల్లింపులు రూ.3.35లక్షలు దాటితేనే వార్షిక ఫీజు మినహాయింపు ఉంటుంది. రెంట్‌ లావాదేవీలు, వ్యాలెడ్ లోడ్ ట్రాన్సాక్షన్స్‌ను చెల్లింపులుగా పరిగణలోకి తీసుకోరు. కాబట్టి వీటికి అన్యువల్‌ ఫీజ్ మినహాయింపు ఉండదు. ఇంధన ఖర్చులు, ఫ్లిప్‌కార్ట్, మింత్రాలో గిఫ్ట్ కార్డ్‌ల కొనుగోలు, ఈఎంఐ లావాదేవీలు, వాలెట్ లోడింగ్ లావాదేవీలు, నగదు అడ్వాన్స్‌లు, అద్దె చెల్లింపులు, నగల కొనుగోలు, బీమా సేవలు, వినియోగాలు, విద్యా సేవలు, కార్డ్ ఫీజు చెల్లింపు లాంటి వాటికి క్యాష్‌బ్యాక్ ఉండదని బ్యాంక్‌ ప్రకటించింది.

కొన్ని చెల్లింపులను తొలగించడంతో యూజర్లు షాక్‌

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అన్యువల్ ఫీజు రూ.500గా ఉన్నది. అయితే, ఇప్పటివరకు ఏడాదికి రూ.2లక్షలు ఖర్చు చేసేవారికి వార్షిక ఫీజు మినహాయింపు లభించేది. కానీ, ఈ లిమిట్ రూ.3.50లక్షలకు పెంచింది. ఇందులోనే కొన్ని చెల్లింపులను తొలగించడం యూజర్లకు పెద్ద షాకింగ్‌లాంటిదే. యాక్సిస్ బ్యాంక్ మొదట మొత్తం ఐదు క్రెడిట్ కార్డుల నియమనిబంధనల్ని మార్చినట్టు వార్తలు వచ్చాయి. కానీ, తర్వాత ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుకు సంబంధించిన నిబంధనలను మాత్రమే మార్చినట్లు స్పష్టం చేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు