Vizag: విశాఖ యువతి కేసులో బిగ్ ట్విస్ట్.. అసలు ప్రియకు ఏమైంది?

ఆర్టీవీతో విశాఖ సౌత్‌ ఏసీపీ త్రినాథ్‌ మాట్లాడారు. యువతి పోలీసులతో మాట్లాడినట్లు ఆయన వివరించారు. ఆమెను ఎవరూ కూడా తోయలేదని..కాలుజారి తానే పడినట్లు తెలిపిందిన వివరించారు. కావ్య, ఫణింద్ర ఇద్దరు పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు.

New Update
Vizag: విశాఖ యువతి కేసులో బిగ్ ట్విస్ట్.. అసలు ప్రియకు ఏమైంది?

విశాఖపట్నం (Vizag) లో 12 గంటల పాటు రాళ్ల మధ్య చిక్కుకున్న మచిలీపట్నం (Machilipatnam) యువతి స్టోరీలో నిమిషానికో ట్విస్ట్‌ బయటకు వస్తుంది. సరదాగా ఫోటోలు దిగుతున్న సమయంలో కాలు జారి రాళ్ల మధ్య పడిపోవడంతో 12 గంటలుగా నరకయాతన అనుభవించి.. స్థానిక జాలర్ల సాయంతో బయటకు వచ్చిన యువతిని కావ్య ప్రియ (kavya priya) గా గుర్తించారు.

యువతి వారం రోజుల క్రితం తన ప్రియుడు ఫణింద్ర వర్మ రాజుతో కలిసి వైజాగ్‌ పారిపోయి వచ్చింది. అప్పటి నుంచి ఆమె ప్రియునితో కలిసి అప్పికొండ శివాలయం ప్రాంతంలో ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం ఇద్దరూ కూడా విశాఖ బీచ్‌ కు వెళ్లగా అక్కడ సరదాగా ఫోటోలు తీసుకుంటుండగా..యువతి కాలు జారి రాళ్ల మధ్యన పడిపోయింది. అయితే ఈ ప్రమాదంలో యువతి కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం జరగడంతో భయపడిన యువకుడు అక్కడ నుంచి పారిపోయాడు.

Also read: దసరాకు కొత్త కారు కొంటున్నారా..? ఆ కారుపై ఏకంగా రూ.65 వేల భారీ డిస్కౌంట్!

దిక్కుతోచని స్థితిలో యువతి రాత్రంతా కూడా రాళ్ల మధ్యే ఉండిపోయింది. సోమవారం ఉదయం అటుగా వెళ్తున్న కొందరు యువతిని గుర్తించి స్థానిక జాలర్లుకు చెప్పగా..వారు యువతిని కాపాడి బయటకు తీసుకుని వచ్చారు. యువతిని యువకుడి గురించి ప్రశ్నించగా ఆమె కన్నీళ్లతో ఆమె యువకుడిని ఏమి అనవద్దని కన్నీళ్లు పెట్టుకుంది.

యువతిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో కేజీహెచ్‌కు తరలించారు. యువతిని ప్రమాదం గురించి ప్రశ్నించగా..కాలుజారి పడిపోయానని తెలిపింది. అంబులెన్స్‌ సిబ్బంది యువతి తల్లికి సమాచారమివ్వగా..వారు వైజాగ్‌ వస్తున్నట్లు తెలిపారు. వారు ఇప్పటికే మచిలీపట్నం పోలీసులకు కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Also read: ఈ టీమిండియా మొనగాడు వస్తున్నాడు.. ఇక ప్రత్యర్థులకు చుక్కలే..!

అయితే ప్రియురాలిని కొండ మీద నుంచి ప్రియుడే తోసేసి పరారైయ్యాడని ఒక వాదన వినిపిస్తుంది. ప్రియురాలి వద్ద ఉన్న డబ్బు..బంగారంతో ప్రియుడు ఉడాయించినట్లు యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం గురించి కేసు నమోదు చేసుకున్న దువ్వాడ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ క్రమంలో ఆర్టీవీతో విశాఖ సౌత్‌ ఏసీపీ త్రినాథ్‌ మాట్లాడారు. యువతి పోలీసులతో మాట్లాడినట్లు ఆయన వివరించారు. ఆమెను ఎవరూ కూడా తోయలేదని..కాలుజారి తానే పడినట్లు తెలిపిందిన వివరించారు. కావ్య, ఫణింద్ర ఇద్దరు పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. బందరులో యువతి మిస్‌ అయ్యిందని కేసు నమోదు అయ్యింది.బందు పోలీసులకు విచారణ నిమిత్తం పూర్తి సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి యువకుడు పరారీలో ఉన్నాడని అతని కోసం గాలిస్తున్నట్లు వివరించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు