Finger Prints : అద్భుతం.. క్షణాల్లో వేలిముద్రలను గుర్తించే స్ప్రే.. చైనాలోని షాంఘై నార్మల్ యూనివర్సిటీ, బ్రిటన్‌లోని బాత్ యూనివర్సిటీ పరిశోధకులు కొత్తగా ఓ ఫ్లోపిసెంట్ స్ప్రేను అభివృద్ధి చేశారు. ఈ స్ప్రే చల్లిన కొన్ని సెకన్లలోనే వేలి ముద్రలు ప్రత్యక్షమవుతాయి. దీనివల్ల ఫొరెన్సిక్ నిపుణుల దర్యాప్తు.. మరింత సులభంగా, వేగంగా జరిగిపోతుంది. By B Aravind 03 Mar 2024 in ఇంటర్నేషనల్ నేషనల్ New Update షేర్ చేయండి Finger Prints Spray : ఎవరైనా ఏదైన నేరం చేసి తప్పించుకున్నప్పుడు.. వాళ్లని కనిపెట్టేందుకు పోలీసులకు లభించే కీలక ఆధారమే వేలి ముద్రలు(Finger Prints). ఫోరెన్సిక్ నిపుణులు ఆ వేలిముద్రలను పరిశీలించి అవి ఎవరివో గుర్తిస్తారు. ఏదైన వస్తువును తాకినప్పుడు.. చెమట(Sweat) లేదా నూనె వల్ల అదృశ్య వేలిముద్రలు దానిపై పడతాయి. వీటిని లేటెంట్ ఫింగర్ ప్రింట్స్(Latent Finger Prints) అని అంటారు. నేర విచారణలో భాగంగా ఫోరెన్సిక్ నిపుణులు వాటిని సేకరిస్తారు. సాధారణంగా ఫొరెన్సిక్ నిపుణలు.. వేలిముద్రల కోసం.. ఆయా వస్తువులపై విషపూరితమైన ఓ పొడిని చల్లుతుంటారు. కానీ దీనివల్ల ఆ వేలిముద్రలో డీఎన్‌ఏ ఆధారాలు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల కొన్నిసార్లు నేరస్తులను గుర్తించలేని పరిస్థితి ఉంటుంది. Also Read : ఈవీఎంలపై భయాందోళనలు అనవసరమన్న ఎన్నికల కమిషనర్.. అయితే చైనా(China) లోని షాంఘై నార్మల్ యూనివర్సిటీ, బ్రిటన్(Britain) లోని బాత్ యూనివర్సిటీ పరిశోధకులు కొత్తగా ఓ ఫ్లోపిసెంట్ స్ప్రే(Spay) ను అభివృద్ధి చేశారు. ఈ స్ప్రే విషతుల్యం కాదు.. నీళ్లలో కూడా కరిగిపోతుంది. ఈ స్ర్పే చల్లిన కొన్ని సెకన్లలోనే వేలి ముద్రలు ప్రత్యక్షమవుతాయి. దీనివల్ల ఫొరెన్సిక్ నిపుణుల దర్యాప్తు.. మరింత సులభంగా, వేగంగా జరిగిపోతుంది. వీటిని ఎల్‌ఎఫ్‌పీ-యెల్లో(LFP-Yellow), ఎఫ్‌ఎఫ్‌పీ రెడ్(FFP-Red) అనే రెండు రంగుల్లో తయారుచేశారు. స్ప్రే చల్లిన తర్వాత అది వేలిముద్రల్లో కొన్ని రుణావేశిత పరమాణువతో బంధాన్ని ఏర్పరుస్తుంది. ఆ తర్వాత ఫ్లోరిసెంట్ కాంతి వస్తుంది. బ్లూ కలర్‌లో వచ్చే కాంతి వెలుగులో ఇది కనిపిస్తుంది. దీని నుంచి వేలిముద్రలు సెకన్లలోనే ప్రత్యక్షమవుతాయి. అంతేకాదు.. ఈ స్ప్రే ద్వారా లభించిన వేలిముద్రల్లో డీఎన్ఏ విశ్లేషనకు ఎటువంటి ఆటంకం కలగించబోవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. #telugu-news #spray #finger-prints #forensic మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి