Sankranti: సంక్రాంతికి కొత్త అల్లుడికి ఎందుకంత ప్రాధాన్యత..? సంక్రాంతికి ఇంటికి కొత్తల్లుడు వస్తున్నాడంటే ఆ హడావుడే వేరుగా ఉంటుంది. కొత్త అల్లుడు ఉన్న అత్తమామలు సంక్రాంతి రోజున అల్లుడిని ఇంటికి ఆహ్వానించి కొత్త బట్టలు పెడతారు. ఇలా పెడితే అందరికి మేలు జరుగుతుందని నమ్ముతారు. By Vijaya Nimma 13 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Sankranti: సంక్రాంతి అంటే మూడు రోజులు పిల్లాపెద్దా అంతా సంతోషంగా జరుపుకునే పండుగ. రంగురంగుల ముత్యాల ముగ్గులు అందులో గొబ్బెమ్మలు, భోగిమంటలు, పిండి వంటలు, కొత్త అల్లుళ్లు, సంక్రాంతికి ప్రత్యేకం. ముఖ్యంగా చేతికందిన పంట చూసి రైతు కళ్లల్లో ఆనందం తెచ్చే పండగే ఈ సంక్రాంతి. దీనినే తెలుగువారి అచ్చతెలుగు పల్లె పండగ, పెద్ద పండగ అని కూడా అంటారు. ఈ పండగకు బసవన్నల చిందులు, హరిదాసుల సంకీర్తనలు, గాలి పటాలు, బావామరదళ్ల సరసాలు, కోడిపందేలు ఇలాంటి సరదాలెన్నో అందరికి కనువిందు చేస్తాయి. చిన్నపెద్ద ఉత్సాహ వేడుక: అయితే.. సంక్రాంతికి ఇంటికి కొత్తల్లుడు వస్తున్నాడంటే ఆ హడావుడే వేరుగా ఉంటుంది. బావా మరదళ్ల సరసాలు, సరదాలే వేరుగా ఉంటాయి. అవి కావాలి,ఇవి కావాలంటూ కొత్త అల్లుడి అలక.. అతడిని బుజ్జగించే మామ.. ఆ సందడే ఎంతో అద్భుతంగా ఉంటుంది. సంక్రాంతి రోజున గాలి పటాలు ఎగరవేయడానికి పిల్లలతో పాటు పెద్దవారు సైతం ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. మేలు జరుగుతుందని: సంక్రాంతిలో మూడోరోజు ముక్కనుమగా వ్యవహరిస్తారు. కొత్తగా వివాహం చేసుకొన్న యువతులు సౌభాగ్యం కోసం బొమ్మల నోము, సావిత్రి గౌరీ వ్రతం వంటివి చేస్తారు. సంక్రాంతి రోజున పితృదేవతల ఆత్మశాంతి కోసం ఎవరి శక్తికి తగ్గట్టు వాళ్లు దాన ధర్మాలు చేస్తుంటారు. ఇలా చేస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. కొత్త అల్లుడు ఉన్న అత్తమామలు సంక్రాంతి రోజున అల్లుడిని ఇంటికి ఆహ్వానించి కొత్త బట్టలు పెడతారు. ఇలా పెడితే అందరికి మేలు జరుగుతుందని నమ్ముతారు. ఇది కూడా చదవండి: కలలో ఆవు కనిపించిందా..అయితే ఏం జరుగుతుందో తెలుసా..? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఇది కూడా చదవండి: పిల్లలు మొబైల్స్‌కు బానిసగా మారారా..? ఎలా బయటపడాలి..? #sankranti #son-in-law #important మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి