మహేష్‌ బాబు ఇంటికి కొత్త అతిథి!

మా ఇంటికి కొత్త గెస్ట్‌ వచ్చింది. తన రాకతో మా అందరిలో సంతోషాలు వచ్చాయి. ముఖ్యంగా సితారకి...ఆమెతో ఆడుకునేందుకు కొత్త గెస్ట్‌ రెడీ గా ఉంది అంటూ సోషల్‌ మీడియాలో రాసుకొచ్చారు.

New Update
మహేష్‌ బాబు ఇంటికి కొత్త అతిథి!

కొంత కాలం క్రితం మహేశ్‌ బాబు భార్య నమ్రత శిరోద్కర్‌ మా ఇంటిలోని ముఖ్యమైన వారిని ఒకరిని కోల్పోయాం. ఆ బాధలో నుంచి ఇప్పుడు అప్పుడే బయటకు రాలేము అంటూ సోషల్‌ మీడియా వేదికగా ఆమె బాధను పంచుకున్నారు. అసలేం అయ్యిందంటే..సూపర్ స్టార్ మహేశ్‌ బాబు ముద్దల తనయ సితార ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న ప్లూటో అనే కుక్క పిల్ల కొంత కాలం క్రితం చనిపోయింది.

ఆ విషయాన్ని నమ్రత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అయితే తాజాగా నమ్రత మరో కొత్త పోస్ట్‌ ను అభిమానులతో పంచుకున్నారు. మా ఇంటికి కొత్త గెస్ట్‌ వచ్చింది. తన రాకతో మా అందరిలో సంతోషాలు వచ్చాయి. ముఖ్యంగా సితారకి...ఆమెతో ఆడుకునేందుకు కొత్త గెస్ట్‌ రెడీ గా ఉంది అంటూ సోషల్‌ మీడియాలో రాసుకొచ్చారు.

ఇంతకీ సితారతో ఆడుకోవడానికి వచ్చిన ఆ కొత్త గెస్ట్‌ ఎవరూ అనుకుంటున్నారా? స్నూపీ..నమ్రత సితార కోసం ఓ కొత్త కుక్క పిల్లను తీసుకుని వచ్చారు. దానికి సూప్నీ అని నామకరణం కూడా చేశారు. తన రాకతో కుటుంబం మొత్తం ఎంతో సంతోషంతో ఉందని ఆమె తెలిపారు.

ఏడు సంవత్సరాలుగా మహేశ్‌ ఇంట్లో ఒక కుటుంబ సభ్యురాలిగా ఉంటున్న ప్లూటో అనే కుక్కపిల్ల కొద్ది రోజుల క్రితం చనిపోయింది. ప్లూటో జ్ఙాపకాలను మరచిపోలేకపోతున్నామంటూ కొద్ది రోజుల క్రితం నమ్రత ఓ ఎమోషనల్ పోస్ట్‌ ను నెట్టింట పంచుకున్నారు. ఇప్పుడు ప్లూటో మా వద్దకు ఓ కొత్త కుక్క పిల్లను పంపింది.

దాని పేరు స్నూపీ..మా అందరి ఆనందాలు నీతో ముడిపడి ఉన్నాయంటూ ఆమె రాసుకొచ్చారు. ఓ వైపు ఒక కుక్కపిల్లను కోల్పోయామన్న బాధ. మరోవైపు మరో కుక్కపిల్లను ప్రేమతో పెంచుకోబోతున్నాం అనే సంతోషంతో నిన్ను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నాం స్నూపీ.. నిన్ను మరింత ప్రేమిస్తాం’’ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో షేర్‌ చేసి అంటూ వారు కొత్తగా తీసుకుని వచ్చిన కుక్కు పిల్ల ఫోటోను ఇన్ స్టాలో పెట్టారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pavani Reddy : మొదటి భర్త ఆత్మహత్య.. రెండో పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ!

బిగ్ బాస్ ఫేమ్ పావని రెడ్డి రెండో పెళ్లి చేసుకుంది. బిగ్ బాస్ షోలో పరిచయం అయిన అమీర్ తో రెండేళ్లు ప్రేమలో ఉన్న ఆమె ఏప్రిల్ 20 ఆదివారం రోజున హిందూ సంప్రదాయంలో మూడుముళ్లతో ఒక్కటయ్యారు.  వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  

New Update
pavani-reddy

pavani-reddy

తమిళ టీవీ నటి, బిగ్ బాస్ ఫేమ్ పావని రెడ్డి రెండో పెళ్లి చేసుకుంది. బిగ్ బాస్ షోలో పరిచయం అయిన కొరియోగ్రాఫర్ అమీర్ తో రెండేళ్లు ప్రేమలో ఉన్న ఆమె ఏప్రిల్ 20 ఆదివారం రోజున హిందూ సంప్రదాయంలో మూడుముళ్లతో ఒక్కటయ్యారు.  వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  

తమిళ సీజన్ 5 లో పరిచయం 

ఈ జంట తమ పెళ్లి గురించి రియాలిటీ షో జోడీ ఆర్ యు రెడీలో ప్రకటించారు. ఫిబ్రవరి 2025లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ జంట బిగ్ బాస్ తమిళ సీజన్ 5 లో పాల్గొన్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో షోలోకి అడుగు పెట్టాడు అమీర్.   అక్కడ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడగా అది కాస్త లవ్ గా మారింది. రెండేళ్లు డేటింగ్ లో ఉన్న ఈ జంట తాజాగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది.

సోషల్ మీడియాలో ఈ జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.  హీరో అజిత్ నటించిన తునివు చిత్రంలో ఈ జంట తెరపైన కలిసి నటించడం ద్వారా వార్తల్లో నిలిచారు. కాగా పావనికి గతంలో ప్రదీప్ కుమార్ తో వివాహం జరిగింది, అతను 2017లో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఆ తరువాత డిప్రెషన్ లోకి వెళ్లిన ఆమె మళ్లీ షోలో మెరిశారు. తెలుగులో ఈమె గౌరవం, అమృతంలో చందమామ, సేనాపతి, చారీ 111 సినిమాల్లో నటించారు.  

Also Read : Rajasthan : 17 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి మహిళ లైంగిక దాడి.. కోర్టు సంచలన తీర్పు!

 

Advertisment
Advertisment
Advertisment