Ayodhya: అయోధ్య లోని విమానాశ్రయానికి ఏం పేరు పెట్టారో తెలుసా!

అయోధ్యలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయానికి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్యధామ్‌ గా నామకరణం చేసినట్లు సమాచారం. శనివారం(డిసెంబర్‌ 30) నాడు దీనిని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.

New Update
Ayodhya: అయోధ్య లోని విమానాశ్రయానికి ఏం పేరు పెట్టారో తెలుసా!

జనవరి 22 న ఎంతో వైభవంగా ప్రతిష్ట జరుపుకోబోతున్న అయోధ్య రామ మందిరం కోసం యావత్ దేశం మొత్తం ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది. ఈ క్రమంలోనే అయోధ్యలో నూతనంగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని డిసెంబర్‌ 30 వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

అయితే ఇప్పుడు ఈ విమానాశ్రయానికి ఏం పేరు పెట్టారు అనే దాని మీద చాలా మీద ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ విమానాశ్రయానికి రామాయణ రచయిత మహర్షి వాల్మీకి పేరు పెట్టునున్నట్లు పలు వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విమానాశ్రయాన్ని గతంలో '' మర్యాద పురుషోత్తం శ్రీ రామ్‌ అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయం'' అని పిలిచేవారు.

తాజాగా దీనికి '' మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్య ధామ్‌ '' అంటూ నామకరణం చేశారని తెలుస్తుంది. మోదీ శనివారం అయోధ్యలో పర్యటించనున్నారు. ఆ సందర్భంలోనే ఆయన విమానాశ్రయాన్ని , రైల్వే స్టేషన్‌ ని ప్రారంభిస్తారని అధికారులు పేర్కొన్నారు. అలాగే.. ప్రధాని మోదీ తన అయోధ్య పర్యటన సందర్భంగా వేల కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవం చేయనున్నారు.

శనివారం ఉదయం 11.15 నిమిషాలకు పునరుద్దరించిన అయోధ్య రైల్వే స్టేషన్‌ ను, అక్కడే కొత్త అమృత్‌ భారత్‌ రైళ్లు, వందే భారత్‌ రైళ్లను ఆయన జెండా ఊపి ప్రారంభిస్తారని పీఎంవో వివరించింది. అనేక రైల్వే ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. మధ్యాహ్నం 12.15 నిమిషాలకు కొత్తగా నిర్మించిన అయోధ్య ఎయిర్‌ పోర్టును ఆయన ప్రారంభించనున్నారు.

ఎయిర్‌పోర్టు ప్రారంభించిన రోజున, మొదటి విమానాలను ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నిర్వహిస్తాయి. రెండు విమానయాన సంస్థలు ఇప్పటికే ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ నుండి అయోధ్యకు విమానాలను ప్రకటించాయి, ఇవి జనవరి 2024 నుంచి ప్రారంభమవుతాయి.

Also read: ప్రతి ఆడదాని విజయం వెనుక ఆమెకు రక్షణగా ఓ మగాడు: ఉపాసన కొణిదెల!

Advertisment
Advertisment
తాజా కథనాలు