Aditya L1: సూర్య నమస్కారం వల్ల ప్రయోజనాలేంటి? తప్పక తెలుసుకోవాలి..! సూర్య నమస్కారం వల్ల ప్రయోజనాలు చాలా ఎక్కువ. సూర్య నమస్కారాలు ఒత్తిడిని తగ్గిస్తాయి. చర్మ సంరక్షణకు కూడా సాహాయిపడుతుంది. అటు పిల్లలకు కూడా సూర్య సమస్కారాలతో ఎన్నో లాభాలున్నాయి.ముఖ్యంగా పరీక్షల సమయంలో ఆందోళన, విశ్రాంతి లేని అనుభూతిని తగ్గిస్తుంది. మరోవైపు ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 ప్రయోగంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. By Trinath 02 Sep 2023 in లైఫ్ స్టైల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Benefits of Surya Namaskar: ఆదిత్య ఎల్-1 (Aditya-L1) ప్రయోగంతో ఇండియా పేరు మరోసారి ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. చంద్రయాన్-3 సక్సెస్‌ని ఓవైపు ఎంజాయ్ చేస్తూనే మరోవైపు ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్ని జరిపారు ఇస్రో సైంటిస్టులు. ఈరోజు ఉదయం 11.50 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఆదిత్య-ఎల్1 ఆర్బిటర్‌ను పీఎస్‌ఎల్‌వీ-సీ57.1 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. భారత తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1ను విజయవంతంగా ప్రయోగించిండంతో ఇస్రోని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అభినందించారు. మరోవైపు ప్రయోగానికి ముందు డూన్ యోగా పీత్‌లో పలువురు సూర్య నమస్కారాలు చేశారు. ఈ క్రమంలో సూర్య నమస్కారాలపై చర్చ జరుగుతోంది. సూర్య నమస్కారం వల్ల ప్రయోజనాలేంటి? ➼ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ➼ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ➼ శరీరాన్ని, మనస్సును సమతుల్యం చేస్తుంది. ➼ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ➼ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది ➼ గుండెను బలపరుస్తుంది. ➼ ఉదర కండరాలు, శ్వాసకోశ వ్యవస్థ, శోషరస వ్యవస్థ, వెన్నెముక నరాలు ఇతర అంతర్గత అవయవాలను ప్రేరేపిస్తుంది. ➼ వెన్నెముక, మెడ, భుజం, చేతులు, చేతులు, మణికట్టు, వీపు, కాలు కండరాలను టోన్ చేస్తుంది. ➼ శరీరం, శ్వాస, మనస్సు పరస్పర అనుసంధానాన్ని నియంత్రిస్తుంది. ➼ శక్తి స్థాయిలను పెంచుతుంది. ➼ సహజంగా నిద్రలేమిని నయం చేస్తుంది. ➼ చర్మ సంరక్షణ & జుట్టు సంరక్షణలో సహాయపడుతుంది. ➼ ఒత్తిడిని తగ్గిస్తుంది. ➼ అంతర్ దృష్టిని పెంచుతుంది. పిల్లలకు ఎంతగానో ఉపయోగం: చిన్నవయసులోనే ఒత్తిడికి, ఆందోళనకు గురవుతున్నారు. సూర్య నమస్కారం పిల్లలు వారి మనస్సులను ప్రశాంతంగా ఉంచడానికి, ఏకాగ్రతను మెరుగుపరచడానికి, ఓర్పును పెంపొందించడానికి సహాయపడుతుంది . ఇది ముఖ్యంగా పరీక్షల సమయంలో ఆందోళన, విశ్రాంతి లేని అనుభూతిని తగ్గిస్తుంది. సూర్య నమస్కారాన్ని క్రమం తప్పకుండా పాటించడం వల్ల శరీరానికి బలం, తేజస్సు లభిస్తుంది. ఇది కండరాల పెరుగుదలకు కూడా సహాయపడుతుంది . ఐదు సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు కూడా ప్రతిరోజూ సూర్య నమస్కారాన్ని చేయవచ్చు. మరోవైపు ఆదిత్య ఎల్1 సూర్యుని కక్ష్యలోకి చేరుకోవడానికి 128 రోజులు పడుతుంది. ఈ మిషన్ ఇస్రో అత్యంత విశ్వసనీయమైన PSLV రాకెట్‌తో ప్రయోగించారు. ఇప్పటి వరకు అమెరికాతో సహా అనేక దేశాలు సూర్యుని అధ్యయనం కోసం ఉపగ్రహాలను పంపినప్పటికీ, ఇస్రో- ఆదిత్య ఎల్ వన్ దానికదే ప్రత్యేకమైనది. ASLO READ: చరిత్ర సృష్టించిన ఇస్రో… గాల్లోకి దూసుకెళ్లిన ఆదిత్య L -1..!! #aditya-l1 #aditya-l-1 #aditya-l1-mission-isro #surya-namaskar #benefits-of-surya-namaskar #surya-namaskar-benefits మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి