Netflix : 'కాంధార్‌ హైజాక్‌' వివాదంపై స్పందించిన నెట్‌ఫ్లిక్స్‌.. ఉగ్రవాదుల పేర్లు మార్చింది అందుకే అంటూ

‘ఐసీ 814: ది కాంధార్‌ హైజాక్’ వెబ్ సిరీస్ పై నెలకొన్న వివాదంపై నెట్ ఫ్లిక్స్ సంస్థ స్పందించింది. సిరీస్ లో నిరాకరణగా ఉగ్రవాదుల అసలు పేర్లను మేకర్స్ అధికారికంగా చేర్చారని నెట్‌ఫ్లిక్స్‌ కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ ఓ ప్రకనటనలో పేర్కొన్నారు.

New Update
Netflix : 'కాంధార్‌ హైజాక్‌' వివాదంపై స్పందించిన నెట్‌ఫ్లిక్స్‌.. ఉగ్రవాదుల పేర్లు మార్చింది అందుకే అంటూ

Netflix : ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 1999 నాటి కాందహార్‌ హైజాక్‌ ఉదంతం నేపథ్యంలో తెరకెక్కించిన ‘ఐసీ 814: ది కాందహార్‌ హైజాక్‌' వెబ్ సిరీస్ ఇటీవల నెట్ ఫ్లిక్స్ ఇటీటీలో నేరుగా రిలీజైన విషయం తెలిసిందే. ఇందులో విజయ్‌వర్మ, నసీరుద్దీన్‌షా, అరవిందస్వామి తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. అయితే ఈ సిరీస్‌లో ఉగ్రవాదుల పేర్లను భోళాశంకర్‌, బర్గర్‌, డాక్టర్‌ అనే వివిధ పేర్లతో చూపించారు.

దీనిపై సోషల్‌మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రేక్షకుల్ని తప్పుదోవ పట్టించేలా ఉద్దేశ్యపూర్వకంగా ఉగ్రవాదుల పేర్లను మార్చి చూపించారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం కేంద్ర ప్రభుత్వ దృష్టికి చేరడంతో ప్రసార, మంత్రిత్వ శాఖ నెట్‌ఫ్లిక్స్‌కు సమన్లు జారీచేసింది. ఈ క్రమంలోనే నెట్‌ఫ్లిక్స్‌ కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Also Read : పదేళ్లుగా అతనితో ప్రేమలో ఉన్నా.. సంచలన విషయం బయటపెట్టిన సాయి పల్లవి

సిరీస్ లో నిరాకరణగా ఉగ్రవాదుల అసలు పేర్లను మేకర్స్ అధికారికంగా చేర్చారని ఆమె పేర్కొన్నారు. ' 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 814 హైజాక్ గురించి తెలియని ప్రేక్షకుల ప్రయోజనం కోసం, హైజాకర్ల నిజమైన మరియు కోడ్ పేర్లను చేర్చడానికి ప్రారంభ నిరాకరణ అప్‌డేట్ చేయబడింది. సిరీస్‌లోని కోడ్ పేర్లు ఆ సమయంలో జరిగిన వాస్తవ సంఘటనను ప్రతిబింబిస్తాయి.

భారతదేశంలో కథలు చెప్పే గొప్ప సంస్కృతి ఉంది. మేము ఈ కథలను వాటి ప్రామాణికమైన ప్రాతినిధ్యాన్ని ప్రదర్శించడానికి కట్టుబడి ఉన్నాము' అని ప్రకటనలో పేర్కొన్నారు. కాగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశమైన కొన్ని గంటల తర్వాత ఆమె సోషల్ మీడియాలో ఈ ప్రకనట చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో 28 మంది మృతి.. తనికెళ్ల భరణి కన్నీటి కవిత

పహల్గాం టెర్రరిస్టు అటాక్‌పై సినీ నటుడు తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక కన్నీటి కవితను షేర్ చేసారు. కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది! అంటూ ఆ కవిత సాగుతుంది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.

New Update
Pahalgam Terror Attack

Pahalgam Terror Attack

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అందమైన ప్రదేశాలను చూసేందుకు వచ్చిన టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో దాదాపు 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ముస్లిమేతరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడినట్లు సాక్ష్యులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

అమాయక ప్రజల మృతిపై ఇప్పటికే సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తలు సంతాపం తెలిపారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని అస్సలు వదలకూడదని.. కఠినంగా శిక్షించాలంటూ భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ యాక్టర్ తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఒక కవితతో ఉన్న పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

కన్నీటి కవిత

కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది!
అక్కడ ఉన్నట్టుండి పాకే పాకే పసిబిడ్డ నెత్తురు ముద్దై పోతుంది. 

సామగానం చేసే కాశ్మీరీ పండితుల కంఠాల్లోంచి వేదం ఆగి- రుధిరం బైటికొస్తుంది.

అక్కడ రేపు పల్లకీ లెక్కి ఊరేగాల్సిన పెళ్ళికొడుకులు ఇవాళే పాడెక్కుతారు...

ఆ లోయలో హిమాలయాలు సైతం మూర్తీభవించిన వైధవ్యాల్లా ఉంటాయ్

భరతమాత కిరీటం వొరుసుకునీ నిరంతరం అక్కడ నెత్తురోడుతూ ఉంటుంది !

బుద్ధుడు కూడా కళ్ళూ నోరూ మూసుకుని మళ్ళీ అంతర్ముఖుడౌతాడు !!

ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం రాసిన కవిత, ఇంకా తడిగానే ఉంది!! అంటూ తనికెళ్ల భరణి ఒక కవితను పంచుకున్నారు. ఇప్పుడది నెట్టింట వైరల్‌గా మారింది. 

 

pahalgam | Pahalgam attack | pahalgam breaking news | tanikella-bharani | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment