Uttara Pradesh : మర్మాంగాలకు రాళ్ళను కట్టి.. చిత్రహింసలు పెట్టి..కాన్పూర్‌లో సీనియర్ల దురాగతం డబ్బులు ఇవ్వలేదని జూనియర్ విద్యార్ధిని చిత్రహింసలు పెట్టారు సీనియర్లు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో నీట్ కోచింగ్ సెంటర్‌లో ఈ దారుణం జరిగింది. బాధిత విద్యార్ధి మర్మాంగాలనికి తాడుకట్టి వేలాడదీయడమే కాకుండా..జుట్టు కాల్చి, కొట్టి అమానుషంగా ప్రవర్తించారు. By Manogna alamuru 08 May 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Kanpur : ప్రతీ కాలేజ్‌లో ర్యాగింగ్(Ragging) చేయడం సాధారణమైపోయింది. దీనిపై ఇప్పటికే చాలా కేసులు వచ్చాయి. చాలచోట్ల ఇలా ర్యాగింగ్‌లకు పాల్పడడం చట్ట రిత్యా నేరంగా పరిగణిస్తూ శిక్షలు కూడా వేస్తున్నారు. అయినా కూడా విద్యార్ధుల్లో ఈ ర్యాగింగ్ భూతం వదలడం లేదు. తాజాగా కాన్పూర్‌లో జరిగిన ఒక ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. కాన్పూర్‌లోని కాకదేయో నీట్ కోచింగ్ అకాడమీ(Kakatiya NEET Coaching Academy) లో ఆ దారుణం జరిగింది. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ఇటావాకు చెందిన ఓ విద్యార్ధిని నీట్ కోచింగ్ సెంటర్‌లో అతని సీనియర్లు దారుణంగా కొట్టారు. బాధిత విద్యార్ధి ఇంటర్ తర్వాత నీట్ ఎగ్జామ్స్ రాసేందుకు కాన్పూర్‌కు కోచింగ్ కోసం వచ్చాడు. అక్కడ అతను ఆన్‌లైన్ బెట్టింగ్ ఆడాడు. దాని కోసం అతను సీనియర్ల దగ్గర నుంచి 20 వేల రూపాయలను తీసుకున్నాడు. కానీ బాధిత విద్యార్ధి బెట్టింగ్‌లో ఓడిపోయాడు. దాంతో వాళ్ళ డబ్బులను వెనక్కు తిరిగి ఇవ్వలేకపోయాడు. దీన్ని అదనుగా చేసుకున్న సీనియర్ విద్యార్ధులు బాధిత విద్యార్ధిని వేధించారు. 20 వేలకు బదులుగా...50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జననాంగాలకు రాళ్ళను కట్టి వేలాడదీసి.. బాధిత విద్యార్ధి డబ్బులు ఇవ్వనందుకు సీనియర్లు అతన్ని దారుణంగా కొట్టి చిత్ర హింసలు పెట్టారు. ఏకంగా పది రోజులు గదిలో బంధించి హింసించారు. అతని జుట్టును కాల్చారు. మర్మాంగాలకు ఇటుకను కట్టి వేలాడదీశారు. బాధిత విద్యార్ధి ప్రాణాలు పోయేలా హింసించారు. ఇదంతా చేస్తున్నప్పుడు వీడియోలు కూడా తీశారు. ఇప్పుడు ఆ వీడియోలు బయటకు రావడంతో అందరూ షాక్‌కు గురవుతున్నారు. ఈ వీడియోలు వైరల్‌గా కూడా మారాయి. దానికి తోడు బాధిత విద్యార్ధి మరదలు, తల్లిదండ్రులు సీనియర్ విద్యార్ధుల మీద పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. #UttarPradesh: Students preparing for #NEET in #Kanpur brutally beat up their classmate. He was hung by tying a rope around his private part. They tried to burn his hair with fire spray. Actually, the victim student lost 20K in an online game. pic.twitter.com/TO1MhtAt0y — Siraj Noorani (@sirajnoorani) May 7, 2024 వీడియో వైరల్.. ఈ సంఘటన ఏప్రిల్ 20న జరిగింది. అయితే ఇప్పుడు దీని తాలూకా వీడియోలు బయటకు వచ్చాయి. వీటి ఆధారంగా కాకదేయో పోలీసులు ఇప్పటికే ఆరుగురు విద్యార్ధులను అరెస్ట్ చేశారు. IPC సెక్షన్లు 147, 34, 343, 323, 500, 506, మరియు 307 కింద కేసు నమోదు చేశారు. వారిపై పోక్సో చట్టం మరియు IT చట్టంలోని సెక్షన్ 67(బి) నిబంధనల ప్రకారం కూడా అభియోగాలు మోపారు. హత్యాయత్నం, పోక్సో, అల్లర్లు, వస్త్రాపహరణం, దహనం, బందీ, దాడి, దుర్వినియోగం, ఐటీ చట్టం వంటి సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సెంట్రల్ డీసీపీ ఆర్‌ఎస్ గౌతమ్ తెలిపారు. Also Read:RRR మూవీ కలెక్షన్లను దాటిన RR ట్యాక్స్.. రేవంత్ సర్కార్ పై మోదీ ఎటాక్ #uttar-pradesh #kanpur #ragging #11-people-killed #kakatiya-neet-coaching-academy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి