Garlic: ఈ సారి వెల్లుల్లి వంతు వచ్చింది..రోజురోజుకి! By Bhavana 12 Oct 2023 in బిజినెస్ New Update షేర్ చేయండి నిన్న మొన్నటి వరకు టమాటాలు కొండెక్కి కూర్చున్నాయి. ఆ తరువాత ఆ బాటలోకి నెమ్మదిగా పచ్చిమిర్చి, ఉల్లిపాయ వచ్చి చేరాయి. ఇప్పుడు నేను ఏమన్నా తక్కువ తిన్నాన అంటూ వచ్చి చేరింది వెల్లుల్లి. ప్రస్తుతం దీనిని కొనాలంటే చాలా ఖరీదు పెట్టాల్సి వస్తుంది. నిన్న మొన్నటి వరకు కేజీ 50 నుంచి 60 రూపాయలుగా ఉన్న వెల్లుల్లి..ఇప్పుడు పావు కేజీ 70 కి చేరింది. వెల్లుల్లి సరఫరా రోజురోజుకి రిటైల్ మార్కెట్ కి తగ్గుతూండడంతో కిలో ధర రూ. 280 కి చేరుకుంది. దీంతో వినియోగదారులు వెల్లుల్లి కొనాలన్న కంటిలో నీరు వస్తున్నాయి. ఏపీఎంసీ లో మరో నెలరోజుల్లో వెల్లుల్లి ధరలు సాధారణ స్థితికి చేరుకుంటాయని వ్యాపారులు చెబుతున్నారు. Also read: జనసేనకు మరో భారీ షాక్..ఆ నేత గుడ్ బై చెప్పేశాడు! ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్ కు దాదాపు 15 ట్రక్కులు వస్తుంటాయి. ఎపీఎంసీ పాలకవర్గం లెక్కల ప్రకారం..సాధారణంగా మార్కెట్ కు 24 నుంచి 30 వాహనాలు వస్తుంటాయి. ఇది వరకటి మీద పోల్చుకుంటే వెల్లుల్లి రాకలో దాదాపు 40 శాతం తగ్గుదల ఉంది. అందువల్లే ధరలు విపరీతంగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. "జనవరి నుంచి సరఫరా పెరగడం ప్రారంభమైంది, మార్కెట్ ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోంది" అని ఓ వ్యాపారి చెప్పారు. అయితే నవంబర్, డిసెంబర్‌లో కురిసిన అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. తాజాగా వెల్లుల్లి ధరలు కూడా విపరీతంగా పెరగడంతో వినియోగదారులు భయపడుతున్నారు. వెల్లుల్లి అనేది నిత్యం వంటల్లో ఉపయోగించే వస్తువు కావడంతో..ఇప్పుడు ఇది కొండెక్కి కూర్చోవడంతో వంటగదిలో మరో వస్తువు తగ్గినట్లే అని వినియోగదారులు అంటున్నారు. #price #high #garlic మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి