Odisha: మా ప్రజల హృదయాలను బీజేపీ ఎప్పటికీ గెలుచుకోలేదు.. సీఎం కీలక వ్యాఖ్యలు! సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ, మోడీ పనితీరుపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒడిశా సంపన్న రాష్ట్రంగా ఎదగకపోవడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు. ఒడిశా ప్రజల హృదయాలను బీజేపీ ఎప్పటికీ గెలుచుకోలేదన్నారు. By srinivas 12 May 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Naveen Patnaik: సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ, మోడీ పనితీరుపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి పేపర్లు, సమాచారం తెలుసుకోకుండా ఒడిశాలోని అన్ని జిల్లాల పేర్లు చెప్పాలంటూ మోడీ చేసిన సవాల్ కు కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించిన పట్నాయక్. . ఒడిశా గురించి మీకెంత తెలుసు? అని ప్రశ్నించారు. ఒడియా శాస్త్రీయ భాష అయినా సరే దాన్ని మీరు మరిచిపోయారని విమర్శలు చేశారు. సంస్కృత భాష కోసం మీరు రూ. 1,000 కోట్లు కేటాయించారు. కానీ ఒడియాకు సున్నా కేటాయింపులు జరిగాయాంటూ తీవ్ర విమర్శలు చేశారు. ମୋର କ'ଣ ମନେ ଅଛି କି ନାହିଁ ସେଇଟା ମୋର ପ୍ରିୟ ସାଢ଼େ ଚାରି କୋଟି ଓଡ଼ିଶାବାସୀ ଜାଣିଛନ୍ତି। #JodiShankha pic.twitter.com/OpkecsQt72 — Naveen Patnaik (@Naveen_Odisha) May 11, 2024 అలాగే ఒడిస్సి సంగీతాన్ని కూడా ప్రధాని మోడీ మర్చిపోయారని, క్లాసికల్ ఒడిస్సీ సంగీతానికి గుర్తింపు కోసం తాను రెండుసార్లు ప్రతిపాదనలు పంపితే తిరస్కరించారని మండిపడ్డారు. అన్ని వనరులు ఉన్నా ఒడిశా ఎందుకు సంపన్నవంతం కాలేదు, ప్రజలెందుకు పేదలుగా ఉన్నారు? అని మోడీ అడిగిన ప్రశ్నకు బదిలిస్తూ.. ఒడిశా సహజ సంపద బొగ్గు. ఒడిశా బొగ్గును తీసుకున్న కేంద్ర ప్రభుత్వం గడిచిన పదేళ్ల నుంచి దానిపై రాయల్టీ పెంచడం మర్చిపోయిందన్నారు. ఇదే సమయంలో కేవలం ఎన్నికల కోసం మాత్రమే ఒడిశాను గుర్తుపెట్టుకోవడం వల్ల మోడీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని ఎద్దేవా చేశారు. ఇటీవల భారతరత్న అవార్డు ఇచ్చినప్పుడు ఒడిశా వీర కుమారులను గౌరవించడం ఎందుకు మరిచిపోయిందని మోడీ ప్రభుత్వాన్ని సీఎం దుయ్యబట్టారు. మరో పదేళ్లు అయినా సరే ఏమీ జరగదు. ఒడిశా ప్రజల హృదయాలను బీజేపీ ఎప్పటికీ గెలుచుకోలేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. #odisha #modi #naveen-patnaik మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి