Murder: పెళ్లైన కొన్ని గంటలకే భార్యను నరికి చంపిన వరుడు.. తర్వాత ఏం జరిగిందంటే! కర్ణాటకలో ఓ వరుడు దారుణానికి పాల్పడ్డాడు. బంధువుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్న నవీన్ తాళి కట్టిన కొన్ని గంటల్లోనే భార్య లిఖితశ్రీ ని కొడవలితో నరికి చంపాడు. తర్వాత తాను అదే కొడవలితో గాయపరుచుకోగా చికిత్స పొందుతూ మరణించాడు. By srinivas 08 Aug 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Karnataka: కర్ణాటకలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అంగరంగ వైభవంగా నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న వరుడు.. ఉన్నట్టుండి కృరమృగంలా మారిపోయాడు. మూడు ముళ్లు వేసి మూడు గంటలైన గడవకముందే కట్టుకున్న యువతిని కాటికి పంపించాడు. కోలార్ జిల్లాకు చెందిన నవీన్ కుమార్ అనే యువకుడు పెళ్లి చేసుకున్న కొన్ని గంటలకే తన భార్య లిఖిత శ్రీ ని నరికి చంపిన ఘటన సంచలనం రేపుతోంది. 27 ఏళ్ల నవీన్ కుమార్ మొదట తన భార్య లిఖిత శ్రీ (18)ని కొడవలితో చంపి ఆపై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గదిలోకి వెళ్లి రెడీ అవుతున్న క్రమంలో.. ఈ మేరకు కోలార్ జిల్లాలోని సమీప గ్రామాల నివాసితులు నవీన్- లిఖిత శ్రీ ఆగస్టు 7వ తేదీ బుధవారం వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కాసేపటికి బంధువుల ఇంటికి వెళ్ళే ముందు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కొంత సమయం గడిపారు. అయితే గదిలోకి వెళ్లి రెడీ అవుతున్న క్రమంలో గదిలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహానికి గురైన నవీన్.. లిఖితపై కొడవలితో దాడి చేసి చంపేశాడు. ఆ తర్వాత అదే వస్తువుతో తాను గాయపరుచుకున్నాడు. ఇది కూడా చదవండి: Mallareddy university: మల్లారెడ్డి యూనివర్సిటీలో విషాదం.. అనుమానస్పద రీతిలో విద్యార్థి మృతి! ఈ విషయం గమనించిన బంధువులు తలుపులు పగలగొట్టి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్న జంట కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఇద్దరినీ బంధువులు ఆస్పత్రికి తరలించారు. నవీన్ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా తీవ్రంగా గాయపడిన లిఖిత అప్పటికే మరణించింది. నవీన్ ను మెరుగైన చికిత్స నిమిత్తం మరో ఆసుపత్రికి తరలించగా అతను మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. #karnataka #naveen-kills-wife-likitha #after-wedding మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి