Navadeep: నవదీప్..ఈడీ విచారణలో కీలక విషయాలు..తెర మీదకి ప్రముఖుల పేర్లు! టాలీవుడ్ మాదక ద్రవ్యాల కేసులో హీరో నవదీప్ (Navadeep) ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ నెల 7 న విచారణకు హాజరు కావాలని నవదీప్ కు నోటీసులు జారీ చేసిన ఈడీ. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం ఈడీ ముందు నవదీప్ హాజరయ్యారు. By Bhavana 10 Oct 2023 in సినిమా క్రైం New Update షేర్ చేయండి టాలీవుడ్ మాదక ద్రవ్యాల కేసులో హీరో నవదీప్ (Navadeep) ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ నెల 7 న విచారణకు హాజరు కావాలని నవదీప్ కు నోటీసులు జారీ చేసిన ఈడీ. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం ఈడీ ముందు నవదీప్ హాజరయ్యారు. టాలీవుడ్ లో మాదక ద్రవ్యాల ప్రస్తావన వచ్చింది అంటే కచ్చితంగా వినిపించే పేరు నవదీప్. ఇప్పటికే నవదీప్ పేరు చాలా సార్లు వినిపించింది. ఈ క్రమంలోనే మాదక ద్రవ్యాల కేసు లో అరెస్ట్ అయిన నిర్మాత వెంకటరత్న రెడ్డి నవదీప్ పేరును చాలా క్లియర్ గా ఈడీ అధికారులకు చెప్పడంతో ఈసారి నిందితుల లిస్ట్ లో నవదీప్ పేరును కూడా చేర్చడం జరిగింది. ఈ క్రమంలో అధికారులు నవదీప్ మీద ఫుల్ ఫోకస్ పెట్టేశారు. Also read: రేపు మరోసారి సీఐడీ విచారణకు నారా లోకేష్.. విచారణ తర్వాత సంచలన ప్రెస్‌మీట్ విచారణలో నవదీప్ ను తన అకౌంట్ వివరాలు, తన మేనేజర్, కార్ డ్రైవర్ అకౌంట్ వివరాలు కూడా అడిగే అవకాశలున్నట్లు తెలుస్తుంది. అసలు నవదీప్ కి నైజీరియన్లకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అనే దాని మీద ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. 2017 లో మాదక ద్రవ్యాల కేసులో కూడా నవదీప్ పేరు బయటకు వచ్చింది. అప్పుడు కొన్ని సందర్భాల్లో నవదీప్ ను విచారణకు పిలవగా..ఇప్పుడు తాజాగా మరోసారి ఆయన పేరు తెర మీదకి వచ్చింది. ఈ కేసులో ఆయన పేరు విచారణకు రాగానే ఆయన పరారీలో ఉన్నట్లు పోలీసు అధికారులే తెలిపారు. ఈ మేరకు ఈ కేసులో ఇప్పటికే చాలా మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అదుపులో ఉన్న వారి నుంచి పోలీసులు మరింత సమాచారం రాబడుతున్నారు. విచారణలో నిందితులు చెబుతున్న విషయాలు…వారు ఇస్తున్న వ్యక్తుల వివరాల ప్రకారం మరికొందరిని కూడా అదుపులోనికి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిందితుల కాల్ లిస్ట్ ని పరిశీలిస్తే అందులో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన చాలా మంది ప్రముఖుల పేర్లు తెర మీదకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వారందరి మీద కూడా ప్రత్యేక నిఘా ఉంచినట్లు పోలీసులు వివరించారు. #tollywood #drugs-case #navadeep మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి