/rtv/media/media_files/2025/03/03/iWBxAaWIbzF8tAq4Lxda.jpg)
World Wildlife Day PM Modi Photograph: (World Wildlife Day PM Modi)
ప్రధాని మోదీ అభయారణ్యంలో తిరుగుతున్నాడు. సింహాలు, జింకలను ఫొటోలు తీస్తూ పచ్చని అడవి అందాలను ఆస్వాదిస్తున్నాడు. గుజరాత్ జునాగఢ్‌లోని గిర్ వన్యప్రాణుల అభయారణ్యంలో సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లయన్ సఫారీకి వెళ్లారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ఆయన గిర్ నేషనల్ పార్క్‌ను సందర్శించారు. ఆయనతో పాటు కొంతమంది మంత్రులు, అటవీ శాఖ సీనియర్ అధికారులతో కలిసి జీప్ సఫారీ చేశారు. సింహాలు, జింకలు, వన్యప్రాణులను ఫొటోలు తీస్తూ అడవి అంతా కలియ తిరిగారు.
PM Narendra Modi takes a jungle safari ride in the Gir National Park, the
— Aditi Tandon (@anshumalini3) March 3, 2025
last abode of Asiatic lions today @thetribunechd @narendramodi pic.twitter.com/G1mrrTYTVm
భూమిపై నున్న అద్భుతమైన జీవవైవిధ్యాన్ని రక్షించుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఎక్స్ అకౌంట్‌లో పేర్కొన్నారు. ప్రపంచ మనుగడలో ప్రతి జాతి కీలక పాత్ర పోషిస్తుంది.-- రాబోయే తరాలకు వాటి భవిష్యత్తును కాపాడుకుందాం. వన్యప్రాణులను సంరక్షించడం, రక్షించడంలో భారతదేశం చేస్తున్న కృషికి మనం గర్విస్తున్నామని రాసి మోదీ జంగిల్ సఫారీ వీడియోను ట్యాగ్ చేశారు.
Today, on #WorldWildlifeDay, let’s reiterate our commitment to protect and preserve the incredible biodiversity of our planet. Every species plays a vital role—let’s safeguard their future for generations to come!
— Narendra Modi (@narendramodi) March 3, 2025
We also take pride in India’s contributions towards preserving… pic.twitter.com/qtZdJlXskA
Also read: SLBC tunnel : టన్నల్‌లో ముంచుకొస్తున్న మరో పెద్ద ప్రమాదం!! ఏ క్షణమైనా..
అనంతరం గిర్ వన్యప్రాణుల అభయారణ్యం ప్రధాన కార్యాలయం ససన్ గిర్‌లో జాతీయ వన్యప్రాణుల బోర్డు 7వ సమావేశానికి మోదీ అధ్యక్షత వహించున్నారు. సమావేశం తర్వాత ఆయన ససన్‌లోని కొంతమంది మహిళా అటవీ సిబ్బందితో మాట్లాడనున్నారు. ఆసియా సింహాల జాతిని రక్షిచడానికి గిర్ నేషనల్ పార్క్‌లో కేంద్రం ప్రాజెక్ట్ లయన్ అమలు చేసింది. పెరుగుతున్న సింహాల సంఖ్య ఆధారంగా వాటికి ఆవాసాలను భద్రపరచడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ నేషనల్ పార్క్‌లో 2010నాటికి 411 సింహాలు ఉండగా.. 2015లో 523 సింహాలు, 2020 జూన్ నాటికి 674 వరకు సింహాల సంఖ్య పెరిగిందని అంచనా వేశారు.
Also Read ; Adulterated milk: డేంజరస్ కెమికల్స్‌తో పాల తయారీ.. కల్తీని ఇలా కనిపెట్టండి..!