/rtv/media/media_files/2025/02/08/i749Fl5SwhL7h2cMzaZu.jpg)
Parvesh Verma details
Who is Parvesh Verma: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Assembly Elections) ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఓడిపోయారు. న్యూఢిల్లీ అసెంబ్లీ(New Delhi Assembly) స్థానం నుంచి పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ(Parvesh Verma) చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ప్రస్తుతం పర్వేష్ వర్మ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నారు. దీంతో ఎవరీ పర్వేశ్ వర్మ అని ఇప్పుడు దేశమంతటా హాట్ టాపిక్‌గా మారింది.
Also Read:🔴Delhi Elections Live Updates: పుంజుకున్న AAP.. కౌంటింగ్ లో బిగ్ ట్విస్ట్!
ఎవరీ పర్వేష్ వర్మ?
977 నవంబర్ 07న జన్మించిన పర్వేష్ వర్మ మొత్తం ఆదాయం రూ.10.72 కోట్లు. ఈయన ఎంబీఏ చేసారు. వర్మ మాజీ కేంద్ర మంత్రి, మధ్యప్రదేశ్ బీజేపీ నేత విక్రమ్ వర్మ కుమార్తె స్వాతి సింగ్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పర్వేశ్ వర్మ అసలు పేరు పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ.. ఈయన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. ప్రస్తుతం పర్వేశ్ వర్మ పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు.
Also Read: Delhi BJP CM : ఢిల్లీలో అధికారం దిశగా బీజేపీ.. సీఎం అభ్యర్థి అతనే !
2013 నుంచి 2014 మధ్య మెహ్‌రౌలి నియోజకవర్గంలో గెలిచి ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తరువాత 2014 పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుండి 2,68,586 ఓట్ల రికార్డు ఆధిక్యంతో గెలిచారు. వరుసగా 2019, 2024 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈయన పార్లమెంటు అంచనాల కమిటీ, ఆర్థిక కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. న్యూ ఢిల్లీలో ఆప్ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్‌ను ఓడించి హాట్ టాపిక్ గా మారిన పర్వేశ్ వర్మకు సీఎం సీటు దక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
Also Read: ఓటమి దిశగా సీఎం.. ముందంజలో రమేష్ బిదూరి
Also Read: Delhi Election Results 2025: కాంగ్రాట్స్ రాహుల్.. ఢిల్లీ ఫలితాలపై ట్విట్టర్లో కేటీఆర్ సెటైర్లు!