కుంభమేళలో ఈ బ్యూటీ సాధ్వి కాదు.. ఎవరీ హర్ష రిచారియా..?

కుంభమేళలో కనిపించిన ఓ సాధ్వి వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈమె సాధ్వి కాదని స్వయంగా ఆ యువతే చెప్పింది. 30ఏళ్ల రిచారియా ఉత్తరఖాండ్‌కు చెందిన యాంకర్, సోషల్ యాక్టివిస్ట్, ఇన్‌ఫ్లుయన్సర్ అని ఇస్టాగ్రామ్ బయోలో ఉంది.

New Update
sadhvi

sadhvi Photograph: (sadhvi)

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయోగ్‌రాజ్‌ కుంభమేళలో అందమైన ఓ సాధ్వి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. హిందూ సాంప్రదాయ వస్త్రాలు ధరించి.. చేతిలో రుద్రాక్ష మాల, నుదుటిన తిలకం పెట్టుకున్న లేడీ సాధ్వి అని ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆమె ఫొటోలు, వీడియోలు ఇంటర్‌నెట్‌లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో అందమైన సాధ్విగా ఆ యువతి వైరల్ సెన్సేషన్‌గా మారింది. దీంతో ఆ బ్యూటీ సాధ్వి పేరు, ఊరు కోసం నెటిజన్లు ఇంటర్‌నెట్‌లో వెతుకుతున్నారు. ఆమెకు పెళ్లి అయిందా? కాలేదా.. అని సెర్చ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి :పెద్ద చదువులు చదివి సన్యాసం.. కుంభమేళలో IIT బాబా వైరల్

ఎవరీమె..?

అయితే.. సాధ్వి గెటప్‌లో కనిపించిన ఆమె వాస్తవానికి సాధ్వి కాదట. ఆ విషయం స్వయంగా ఆమెనే చెప్పింది. ఆ బ్యూటీ పేరు రిచారియా, ఆమె వయసు 30ఏళ్లు. ఉత్తరాఖండ్‌కు చెందింది రిచారియా ఇస్టాగ్రామ్ బయోలో యాంకర్, సోషల్ యాక్టివిస్ట్, ఇన్‌ఫ్లుయన్సర్ అని రాసుకుంది. ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిచారియా సాధ్వి కాదని ఆమె చెప్పింది. చిన్నప్పటి నుంచి సాధ్వి అని ఎక్కడా చెప్పలేదు, ఇప్పుడు కూడా సాధ్విని కాను. మంత్ర దీక్ష మాత్రమే చేశానని ఆ బ్యూటీ చెప్పింది.

Also Read: Mahakumbh:కుంభమేళాలో పాల్గొనే 14 అఖాడాలు ఇవే..అసలు వాటి చరిత్ర ఏంటంటే

నిరంజనీ అఖారాకు చెందిన ఆచార్య మహామండలేశ్వర స్వామి కైలాసానంద గిరి జీ మహారాజ్ శిష్యురాలు అని ఆమె చెప్పుకుంది. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం ప్రయాగ్‌రాజ్ దగ్గర ఆమె కుంభమేళ మొదటి రోజు పుణ్యస్నానం ఆచరించింది. రెండు సంవత్సరాల క్రితం రిచారియా యాంకరింగ్, యాక్టింగ్ మరియు మోడలింగ్ ప్రొఫెషన్లు వదిలేసి ఆధ్యాత్మికతకు మారింది. ఆమె ఇప్పుడు మనఃశాంతి, ప్రశాంతత కోరుకుంటున్నట్లు చెప్పారు. సనాతన ధర్మం, ఆధ్యాత్మికం కల్చర్‌పై ప్రస్తుతం దృష్టి పెట్టింది.

Read also ;శ్రీశైలం ఆలయంలో కొట్లాట.. ఈవో Vs అర్చకులు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు