CBSE Tool Kit Exposed : ప్రిన్సిపల్స్ రీల్స్ చేయడమేంటీ?

సీబీఎస్‌ఈ తీసుకొచ్చిన OSM విధానంపై వేలాది అనుమానాలున్నాయి! "మేము రాసిన దానికి, మాకు వచ్చిన మార్కులకు సంబంధమే లేదు" అని స్టూడెంట్స్ అంటున్నారు. కానీ, దేశంలోని టాప్ స్కూల్ ప్రిన్సిపాళ్లు అంతా ఆన్-స్క్రీన్ మార్కింగ్ సూపర్...సీబీఎస్ఈ గ్రేట్!" అంటున్నారెందుకు?

New Update
FotoJet (70)

ravi-prakash-2026-05-27-18-35-07

-RAVI PRAKASH

CBSE Tool Kit Exposed :  నిన్నటివరకు మార్కుల గొడవ..! ఇవాళ.. దేశంలోనే అతిపెద్ద ఎడ్యుకేషన్ స్కామ్! లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును బలిపీఠం ఎక్కించింది ఎవరు? దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న ఈ మహా కుంభకోణం వెనుక అసలు సూత్రధారులెవరు?

నెలలుగా విద్యార్థులు ఏడుస్తున్నారు... తల్లిదండ్రులు రోడ్లపైకి వస్తున్నారు...సీబీఎస్‌ఈ తీసుకొచ్చిన ‘ఆన్-స్క్రీన్ మార్కింగ్’ OSM విధానంపై వేలాది అనుమానాలు వ్యక్తమవుతున్నాయి! "మేము రాసిన దానికి, మాకు వచ్చిన మార్కులకు అస్సలు సంబంధమే లేదు" అని స్టూడెంట్స్ నెత్తీ నోరూ బాదుకుంటున్నారు. వేలాది మంది రీ-ఇవాల్యుయేషన్ కోసం అప్లై చేశారు. ట్రాన్స్‌పరెన్సీ ఎక్కడ అని నిలదీస్తున్నారు! కానీ... సరిగ్గా ఇక్కడే అసలు ట్విస్ట్! 'హిందుస్థాన్ టైమ్స్' పేల్చిన బాంబ్‌తో...విద్యావ్యవస్థను కుదిపేసే షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి! విద్యార్థుల గొంతు నొక్కేలా తెరవెనుక పెద్ద కుట్ర నడిచిందా..? జస్ట్ లుక్ ఎట్ దిస్ రిపోర్ట్! 

సీబీఎస్‌ఈ రీజినల్ ఆఫీసుల నుంచి స్కూల్ ప్రిన్సిపాల్స్‌కు సీక్రెట్‌గా ఒక డాక్యుమెంట్ సర్క్యులేట్ అయింది. దాని పేరు ఏంటో తెలుసా? "మెటీరియల్ ఫర్ ప్రిన్సిపాల్స్". కానీ, లోపల ఉన్నది మాత్రం పక్కా సోషల్ మీడియా టూల్‌కిట్!
అవును! మీరు విన్నది నిజం! విద్యార్థులు తమకు న్యాయం చేయాలని అడుగుతుంటే...సీబీఎస్‌ఈ మాత్రం ప్రిన్సిపాల్స్‌కు రెడీమేడ్ స్క్రిప్ట్‌లు పంపించింది! "ఆన్-స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ సూపర్... ఇందులో ఎలాంటి తప్పులు లేవు..."  అంటూ సోషల్ మీడియాలో రీల్స్ చేయండి, వీడియోలు వదలండి అంటూ డైరెక్షన్స్ ఇచ్చింది!ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే...ఈ టూల్‌కిట్ బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే, దేశవ్యాప్తంగా ఉన్న వేర్వేరు స్కూళ్ల ప్రిన్సిపాల్స్, కొందరు విద్యార్థులు సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం స్టార్ట్ చేశారు. వాటన్నింటిలోనూ వాడిన భాష, స్క్రిప్ట్ అంతా ఒక్కటే.!

ఇది కేవలం మార్కుల కథ కాదు...ఇక్కడ అకౌంటబిలిటీ ప్రశ్నార్థకంగా మారింది!విద్యార్థులు న్యాయం అడుగుతుంటే, సమాధానం చెప్పాల్సిన సీబీఎస్‌ఈ...సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక ఎందుకు దాక్కుంటోంది? స్కూల్ ప్రిన్సిపాల్స్ సడన్‌గా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ స్టార్స్ ఎందుకయ్యారు? వాళ్లతో వీడియోలు చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది?

దేశంలోని వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్న స్కూల్స్...ఒకే టైమ్‌లో, ఒకే రకమైన మెసేజ్‌లతో వీడియోలు ఎలా పోస్ట్ చేశాయి? అవును... మీరు వింటున్నది నిజం! విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న సమయంలో, దేశంలో ఎన్నడూ లేని విధంగా ఒక విచిత్రమైన ట్రెండ్ సోషల్ మీడియాలో ఊపందుకుంది. ఒక నగరం కాదు... ఒక స్కూల్ కాదు... 

అందరూ ఒకే రకమైన హ్యాష్‌ట్యాగ్‌లు... ఒకే రకమైన నినాదాలు ఎక్కుపెట్టారు. అసలు ఈ మ్యాచ్ ఫిక్సింగ్ వెనుక ఉన్నది ఎవరు? మేం ఎవరిపైనా ఆరోపణలు చేయడం లేదు. ఎవరినీ బ్లేమ్ చేయడం లేదు. మేము కేవలం ఆధారాలను మాత్రమే మీ ముందు పెడుతున్నాం! రిపోర్టులు చెబుతున్న వాస్తవాలనే చూపిస్తున్నాం. ఎందుకంటే, విద్యార్థులకు, తల్లిదండ్రులకు నిజాలు తెలియాలి..!అందుకే పక్కా విజువల్ రిపోర్ట్‌తో మీ ముందుకు వచ్చాను.

నెంబర్ వన్!

సిలిగురిలోని ప్రముఖ డీపీఎస్  స్కూల్ ప్రిన్సిపాల్.ఈమె సోషల్ మీడియా వేదికగా ఆన్-స్క్రీన్ మార్కింగ్‌ను వెనకేసుకొస్తూ,  భరోసా కల్పిస్తూ వీడియో వదిలారు. సరే... ఒకరు మాట్లాడితే అది వారి వ్యక్తిగతం అనుకోవచ్చు. కానీ ఇక్కడే కథ మలుపు తిరిగింది!

నెంబర్ టూ!

ఇందులో నగరం మారింది, మేనేజ్‌మెంట్ మారింది,కానీ మ్యాటర్ మాత్రం మారలేదు! శ్రేయా దేవి మహేశ్వరి విద్యాపీఠ్ ప్రిన్సిపాల్ కూడా అదే థీమ్, అదే హ్యాష్‌ట్యాగ్‌లతో సోషల్ మీడియాను హోరెత్తించారు.

నెంబర్ త్రీ అండ్ ఫోర్! 

గుజరాత్‌లోని బరోడా 'న్యూ ఎరా స్కూల్'...అలాగే, దేశ రాజధాని ఢిల్లీలోని 'కేఆర్ మంగళం వరల్డ్ స్కూల్'. విద్యాసంస్థలు వేరైనా... వీరి స్క్రిప్ అంతా ఒక్కటే..!ఎందుకు ఈ ప్రిన్సిపాళ్లంతా విద్యార్థుల ఆవేదనను పక్కనబెట్టి, 
బోర్డుకు భజన చేస్తున్నారు? ఎవరిని ప్రసన్నం చేసుకోవడానికి వారి తాపత్రయం? ఇది ఇక్కడితో ఆగలేదు...మైల్స్ బ్రాన్సన్ స్కూల్, సింఘానియా ఎడ్యుకేషన్ సెంటర్...ఇలా ఒకదాని తర్వాత ఒకటి దాదాపు డజనుకు పైగా వీడియోలునెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. ఇది ముమ్మాటికీ ఒక ప్యాటర్న్! ఒక పీఆర్ క్యాంపెయిన్!

అంతకంటే షాకింగ్ ఏంటంటే...కేవలం ప్రిన్సిపాళ్లే కాదు, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లాంటి ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులను కూడా ఈ వివాదంలోకి లాగారు! వారి చేత కూడా ఆన్-స్క్రీన్ మార్కింగ్ బాగుందంటూ వీడియోలు చేయించారు. ఓవైపు బాధపడ్డ విద్యార్థులు వ్యవస్థను ప్రశ్నిస్తుంటే...విద్యార్థుల చేతే కౌంటర్ ఇప్పించే క్రూయల్‌ మైండ్‌ ఎవరిది..?

ఇక ఇప్పుడు చూడబోయేది... అసలు సిసలైన ఆధారం!గోండియాలోని పిఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయం.ఇక్కడి స్టాఫ్‌కు ముందే ప్రిపేర్ చేసిన ఒక రెడీమేడ్ స్క్రిప్ట్‌ను పంపిణీ చేసినట్లు ఆధారాలు బయటపడ్డాయి! అంటే దీనర్ధం ఏంటి? ఏ స్కూల్ ఏం మాట్లాడాలి? ఎలాంటి రీల్స్ చేయాలి? కెమెరా ముందు ఎలా యాక్ట్ చేయాలి? అనే దానికి పక్కాగా ఒక 'టూల్‌కిట్' సరఫరా అయిందనే అనుమానాలకు...ఈ డాక్యుమెంట్ నూటికి నూరు శాతం బలాన్ని చేకూరుస్తోంది!ఇక్కడ మనం ప్రశ్నిస్తున్నది ప్రిన్సిపాళ్లను కాదు, స్కూల్స్ టీచర్లను కాదు. ఇక్కడ ప్రశ్నిస్తున్నది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఒక పెద్ద వ్యవస్థను!

వేలాది మంది విద్యార్థులు తమకు తక్కువ మార్కులు వచ్చాయని, తాము రాసిన పేపర్లు సరిగ్గా దిద్దలేదని కన్నీరు పెట్టుకుంటున్నారు. బోర్డు నుంచి Transparency, Accountability ఆశిస్తున్నారు. కానీ బోర్డు మాత్రం అవేమీ పట్టించుకోకుండా 'పర్సెప్షన్ మేనేజ్‌మెంట్' చేస్తోంది. విద్యార్థుల కన్నీళ్లను తుడవడం చేతకాని బోర్డు... రీల్స్ ద్వారా, హ్యాష్‌ట్యాగుల ద్వారా ఇమేజ్ బిల్డ్‌ చేసుకోవాలని చూస్తోంది!

తప్పులు చేయడం మానవసహజం... ఏ వ్యవస్థా నూటికి నూరుపాళ్ళు పర్ఫెక్ట్ కాదు. కానీ... తప్పులు జరిగినప్పుడు వాటిని దర్యాప్తు చేసి, బాధ్యతను స్వీకరించి, వ్యవస్థను సంస్కరించాలి. అంతేగానీ... ఇలాంటి సోషల్ మీడియా PR స్టంట్స్‌తో విద్యార్థుల నోళ్లు నొక్కేయాలని చూడటం ఎంతవరకు న్యాయం?

లక్షలాది మంది విద్యార్థులకు కావాల్సింది రీల్స్ కాదు... నిజాయితీతో కూడిన సమాధానాలు! తల్లిదండ్రులకు కావాల్సింది ప్రచారాలు కాదు...తమ పిల్లల భవిష్యత్తుకు భరోసా! ఇప్పటికైనా CBSE ఈ టూల్‌కిట్ డ్రామాలను ఆపి, 
విద్యార్థుల ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే... విద్యార్థుల భవిష్యత్తు పిఆర్ ఎక్సర్‌సైజ్ కాదు... ఇది దేశ భవిష్యత్తు!

Advertisment
తాజా కథనాలు