/rtv/media/media_files/2026/04/17/rahul-gandhi-1-2026-04-17-20-26-16.jpg)
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా కోటాకు సంబంధించిన మూడు బిల్లులపై జరిగిన చర్చ ముగింపులో ఆయన ఒక ఆసక్తికరమైన పొడుపు కథ విసిరారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రభుత్వం ఇప్పుడు తీసుకురావడానికి గల అసలు కారణం '16' అనే అంకెలోనే ఉందని, ఈ నంబర్‌లోనే అన్ని సమాధానాలు దాగి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్ని రేపడమే కాకుండా, ప్రజలను తీవ్ర అయోమయానికి గురిచేశాయి.
Rahul Gandhi's 16 riddle?
— Thirugnanam (@Rebellionaire1) April 17, 2026
😉😉😉😉😉
Guess the answer.
👇👇👇👇👇
Rahul Gandhi said in parliament
in the discussions on
Delimitation and Women Reservation Bills:
"Yesterday the Prime Minister was speaking
in a subdued tone, I was listening.
Suddenly I noticed that today… pic.twitter.com/zU1pChj6cd
నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పిస్తూ
రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పిస్తూ, నిన్న ప్రధాని ప్రసంగిస్తున్నప్పుడు ఆయన చాలా నీరసంగా, కుంగిపోయినట్లు కనిపించారని వ్యాఖ్యానించారు. ఆ సమయంలోనే తాను తన ఫోన్ చూశానని, ఆ రోజు ఏప్రిల్ 16 అని గమనించానని చెప్పారు. అది ఒక జ్ఞానోదయం కలిగించిన క్షణం అని అభివర్ణిస్తూ మై గాడ్! అంకె 16.. ఈ పదహారులోనే అన్నిటికీ సమాధానం ఉంది. అసలు సమస్య ఎక్కడుందో మీకు త్వరలోనే అర్థమవుతుందని ఆయన అన్నారు.
ఎవరికైనా దీని వెనుక ఉన్న మర్మం తెలిస్తే సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా తనకు సందేశం పంపాలని రాహుల్ కోరారు.ఈ '16' మిస్టరీపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. టిడిపికి చెందిన 16 మంది ఎంపీల గురించా? లేక 16 నిమిషాల నిడివి గల ఏదైనా వీడియో ఎక్స్‌పోజ్ కాబోతోందా? లేక అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన ఏదైనా కుంభకోణమా? అని నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారిక 'X' హ్యాండిల్ ఒక పరోక్ష హింట్ ఇచ్చింది. సిక్స్టీన్ అనేది ఎప్స్టీన్ లాగా వినిపించడం లేదు? అంటూ ఒక పోస్ట్ పెట్టింది. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ కేసుతో దీనికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో ఇప్పుడు చర్చ జరుగుతోంది. మొత్తానికి రాహుల్ గాంధీ విసిరిన ఈ 16 అంకెల పజిల్ రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.
Follow Us