Tamil Nadu : గవర్నర్ తప్పు చేస్తున్నారా.. విజయ్ విషయంలో బొమ్మై తీర్పు ఏం చెబుతోంది?

తమిళనాడులో ఎన్నికల ఫలితాలు వచ్చి రోజులు గడుస్తున్నా, అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కుదరడం లేదు. 108 సీట్లు గెలిచిన  tvk పార్టీకి  ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వకుండా, గవర్నర్ 118 మంది మద్దతు పత్రాలు కావాలని

New Update
vijay

తమిళనాడులో ఎన్నికల ఫలితాలు వచ్చి రోజులు గడుస్తున్నా, అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కుదరడం లేదు. 108 సీట్లు గెలిచిన  tvk పార్టీకి  ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వకుండా, గవర్నర్ 118 మంది మద్దతు పత్రాలు కావాలని పట్టుబట్టడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. దీంతో టీవీకే ఫ్యాన్స్ గవర్నర్ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు.

తమిళనాడు అసెంబ్లీలో మొత్తం సీట్లు 234. ఇందులో సగం కంటే ఎక్కువ అంటే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ ఉన్నట్లు లెక్క. విజయ్ పార్టీకి 108 సీట్లు వచ్చాయి, అంటే మ్యాజిక్ ఫిగర్‌కు మరో 10 సీట్లు తక్కువయ్యాయి. కాంగ్రెస్ విజయ్ పార్టీకి మద్దతు తెలిపింది. సో ఇంకా ఐదు సీట్లు  కావాలి. మీకు పూర్తి మెజార్టీ లేదు కాబట్టి, ఆ మిగిలిన 5మంది ఎమ్మెల్యేలు ఎవరో, వారి సంతకాలతో కూడిన మద్దతు పత్రాలు ఇస్తేనే నేను మిమ్మల్ని సీఎంగా ఆహ్వానిస్తానని గవర్నర్ విజయ్ కు ఊహించని షాకిచ్చారు. అయితే  అతిపెద్ద పార్టీగా వచ్చిన తమకు మొదట అవకాశం ఇవ్వాలని తమకు బలం ఉందో లేదో రాజ్‌భవన్‌లో కాదు.. అసెంబ్లీలో తేల్చుకుంటామని టీవీకే నేతలు అంటున్నారు. 

ఫ్లోర్ టెస్ట్ ద్వారానే తేలాలి 

ఈ క్రమంలలో రాజ్యాంగ నిపుణులు ఇప్పుడు 1989 నాటి ఎస్.ఆర్. బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసును గుర్తు చేస్తున్నారు. అప్పట్లో కర్ణాటక సీఎం బొమ్మైకి మెజార్టీ లేదని గవర్నర్ ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు.  ఈ కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఏ ప్రభుత్వానికైనా మెజార్టీ ఉందో లేదో గవర్నర్ నివాసంలో తేలకూడదు.. అది కేవలం అసెంబ్లీలో జరిగే ఫ్లోర్ టెస్ట్ ద్వారానే తేలాలని స్పష్టం చేసింది. ఈ తీర్పు ప్రకారం చూస్తే.. అతిపెద్ద పార్టీగా నిలిచిన విజయ్‌ని పిలిచి, అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకోవడానికి ఆయనకు కొంత సమయం ఇవ్వాలి. అలా కాకుండా ముందే 118 మందిని చూపించమనడం బొమ్మై తీర్పుకు విరుద్ధమని విశ్లేషకులు అంటున్నారు.

మరోవైపు రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌కు కొన్ని విచక్షణాధికారాలు ఉంటాయి. ఒకవేళ ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రానప్పుడు  స్థిరమైన ప్రభుత్వాన్ని ఇచ్చే నాయకుడిని ఎంచుకునే అధికారం గవర్నర్‌కు ఉంటుంది.కానీ, గతంలో గోవా, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో అతిపెద్ద పార్టీని కాదని, చిన్న పార్టీలన్నీ కలిసిన కూటమిని ప్రభుత్వం ఏర్పాటు చేయమని పిలిచిన ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడులో విజయ్‌కి ఆ అవకాశం ఇవ్వకుండా ఆపడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని టీవీకే కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

ఇక విజయ్ కొద్దీసేపటి క్రితమే గవర్నర్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యా బలం తన వద్ద ఉందని,  తన బలాన్ని అసెంబ్లీలో నిరూపించుకుంటానని విజయ్ వెల్లడించారు. ఒకవేళ గవర్నర్ నుంచి సానుకూలమైన నిర్ణయం రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు విజయ్ సిద్దపడుతున్నారు. దీంతో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.  

Advertisment
తాజా కథనాలు