Mamata Banerjee: మోదీకి బిగ్ షాక్.. సుప్రీంకోర్టుకు దీదీ :  బెంగాల్లో హైటెన్షన్!

పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు ఊహించని మలుపు తిరిగాయి. గత 15 ఏళ్లుగా అధికారాన్ని చలాయించిన తృణమూల్ కాంగ్రెస్ ఓటమి పాలైనా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం తన పంతాన్ని వీడటం లేదు.

New Update
modi vs didi

Mamata Banerjee

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు ఊహించని మలుపు తిరిగాయి. గత 15 ఏళ్లుగా అధికారాన్ని చలాయించిన తృణమూల్ కాంగ్రెస్ ఓటమి పాలైనా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం తన పంతాన్ని వీడటం లేదు. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా రాజీనామా చేయనని భీష్మించుకుని కూర్చోవడం ఇప్పుడు రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తోంది.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడ్డాయి. 294 స్థానాలకు గానూ బీజేపీ 207 స్థానాల్లో ఘనవిజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ కేవలం 80 స్థానాలకే పరిమితమైంది. సాధారణంగా ఫలితాలు వచ్చిన వెంటనే ఓడిపోయిన ముఖ్యమంత్రి గవర్నర్‌కు రాజీనామా సమర్పించడం ఆనవాయితీ. కానీ మమతా బెనర్జీ మాత్రం దీనిని తోసిరాజని సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Also Read: TMC రెండు ముక్కలు...మమత మీటింగ్‌కు 10 మంది ఎమ్మెల్యేల డుమ్మా!

"నేను రాజీనామా చేసే ప్రసక్తే లేదు. ప్రజల తీర్పును బీజేపీ హైజాక్ చేసింది. 100కు పైగా స్థానాల్లో ఎన్నికల కమిషన్ సాయంతో ఓట్లను లూటీ చేశారు. ఇది ప్రజల విజయం కాదు, ప్రజాస్వామ్య హత్య" అని మమత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన రాజీనామాను నిరాకరించడాన్ని ఒక నిరసనగా ఆమె అభివర్ణించారు. నన్ను పదవి నుంచి తీసేయాలనుకుంటే రాష్ట్రపతి పాలన విధించుకోండి.. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ కేంద్రానికి నేరుగా సవాల్ విసిరారు.

Also Read: అదిరిపోయే అప్‌డేట్.. బాలయ్యతో బాలీవుడ్ బ్యూటీ స్పెషల్ సాంగ్!

టెక్నికల్‌గా చూస్తే, ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం మే 7తో ముగిసింది. రాజ్యాంగం ప్రకారం గడువు ముగియగానే పాత ప్రభుత్వం రద్దవుతుంది. రాజీనామా చేయకపోయినా, ఆమె ఆ పదవిలో కొనసాగడం చెల్లదు. అయినప్పటికీ, ఆమె తన పట్టుదల వీడకపోవడం చర్చనీయాంశమైంది.  మరోవైపు బీజేపీ తన పని తాను చేసుకుపోతోంది. మే 9న కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య ప్రకటించారు. అయితే, ఆ రోజును బ్లాక్ డేగా పాటిస్తామని మమత ప్రకటించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలందరూ నల్ల దుస్తులు ధరించి నిరసన తెలుపుతారని ఆమె వెల్లడించారు.

Also Read: విజయ్ నీకు ఆరు నెలలు టైమ్ ఇస్తాం.. స్టాలిన్ సంచలన కామెంట్స్!

ఎన్నికల లెక్కింపులో అవకతవకలు

ఇక ఎన్నికల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, ఈ ఫలితాలను రద్దు చేయాలని కోరుతూ తృణమూల్ కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది. ఓటమిని అంగీకరించకుండా మమతా బెనర్జీ చేస్తున్న ఈ పోరాటం బెంగాల్‌ను ఎటువైపు తీసుకెళ్తుందోనని దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది. మే 9న కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందా? లేక ఈ లోపు మరేదైనా రాజకీయ సంచలనం చోటు చేసుకుంటుందా? అనేది వేచి చూడాలి.

Advertisment
తాజా కథనాలు