West Bengal : సీఎంగా సువేందు అధికారి.. బీజేపీ కొత్త కేబినేట్ ఇదే!

బెంగాల్‌లో రాజకీయాల్లో కీలక మార్పు చోటుచేసుకుంది. బీజేపీ నేత సువేందు అధికారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగాల్ గవర్నర్ ఆర్.ఎన్ రవి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.

New Update
cabinet

బెంగాల్‌లో రాజకీయాల్లో కీలక మార్పు చోటుచేసుకుంది. బీజేపీ నేత సువేందు అధికారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగాల్ గవర్నర్ ఆర్.ఎన్ రవి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా,  ముఖ్యమంత్రులు రేఖా గుప్తా ( ఢిల్లీ ), మదన్ లాల్ శర్మ (రాజస్థాన్), మోహన్ యాదవ్ (మధ్యప్రదేశ్), యోగి ఆదిత్యనాథ్ (ఉత్తరప్రదేశ్), చంద్రబాబు ( ఆంధ్రప్రదేశ్ ) తదితరులు హాజరయ్యారు. ఇక5 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా  ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్, నిసిత్ ప్రమాణిక్, ఖుదీరామ్ టుడు, అశోక్ కీర్తానియా ఉన్నారు. కాగా సువేందు అధికారి  పశ్చిమ బెంగాల్ తొమ్మిదవ ముఖ్యమంత్రి కావడం విశేషం. 

మంత్రుల నేపథ్యం ఇదే

దిలీప్ ఘోష్ : ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా ప్రస్థానం ప్రారంభించి, ఆ తర్వాత బీజేపీలోకి వచ్చారు. పశ్చిమ బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడిగా (2015-2021), మాజీ ఎంపీగా పనిచేశారు.
బెంగాల్‌లో బీజేపీ బలోపేతం కావడానికి అత్యంత కీలక పాత్ర పోషించిన ఫైర్‌బ్రాండ్ నాయకుడు. ఈ క్యాబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఖరగ్‌పూర్ సదర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయనకు డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. 

అగ్నిమిత్ర పాల్ : రాజకీయాల్లోకి రాకముందు ఈమె అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్. శ్రీదేవి, మిథున్ చక్రవర్తి వంటి బాలీవుడ్ స్టార్స్‌కు కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. 2019లో బీజేపీలో చేరి, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలిగా, జనరల్ సెక్రటరీగా పనిచేశారు. అసన్సోల్ దక్షిణ్ స్థానం నుండి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఈమె కూడా డిప్యూటీ సీఎం హోదాలో ప్రమాణ స్వీకారం చేశారు. 

నిసిత్ ప్రమాణిక్ :  : గతంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా, క్రీడల శాఖ సహాయ మంత్రిగా నరేంద్ర మోదీ క్యాబినెట్‌లో పనిచేశారు. ఒకప్పుడు టీఎంసీలో కీలక యువజన నాయకుడిగా ఉండి, 2019లో బీజేపీలో చేరారు. ఉత్తర బెంగాల్ ప్రాంతంలో మంచి పట్టున్న యువ నాయకుడు. మాతాభాంగా (SC)  నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

ఖుదీరామ్ టుడు:  వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు (గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ టీచర్). ఎలాంటి నేరచరిత్ర లేని క్లీన్ ఇమేజ్ ఉన్న నేత. పశ్చిమ బెంగాల్‌లోని అటవీ, గిరిజన ప్రాంతమైన బంకురా జిల్లా రాణిబంద్ (ST) నియోజకవర్గం నుండి ఘన విజయం సాధించారు. గిరిజన వర్గాల ప్రతినిధిగా క్యాబినెట్‌లో స్థానం దక్కించుకున్నారు.

అశోక్ కీర్తానియా :  బెంగాల్ జనాభాలో అత్యంత కీలకమైన సామాజిక వర్గమైన మతువాకు చెందిన ప్రముఖ నేత. మతువా ధర్మ ప్రచారంలో, వారి సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారు. బంగావ్ ఉత్తర్ (SC) నియోజకవర్గం నుండి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మతువా సామాజిక వర్గం మద్దతు బీజేపీకి దక్కేలా చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించారు.

Advertisment
తాజా కథనాలు