/rtv/media/media_files/2025/03/26/Ci3X7nGuB8LitruU9KAb.jpg)
wine-shops
ఉత్తర్ ప్రదేశ్ లో మద్యం దుకాణాల వద్ద నిన్న భారీ క్యూలైన్లు కనిపించాయి. 2025 మార్చి 31తో ఆయా షాపుల లైసెన్స్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో తమ వద్ద ఉన్న స్టాకు గడువులోగా విక్రయించేందుకు వ్యాపారులు బంపరాఫర్లు ప్రకటించారు. ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకునేందుకు మద్యం ప్రియులు కూడా బాగానే ఆసక్తి చూపించారు. ఒక బాటిల్ కొంటే మరొకటి ఉచితం అంటూ ఆఫర్లు పెట్టడంతో వైన్స్ షాపుల వద్ద భారీ స్థాయిలో గుమిగూడారు. లక్నోతో సహా అనేక నగరాల్లో మద్యం దుకాణాల వెలుపల ఆఫర్ల భారీ పోస్టర్లు వెలిశాయి.
एक बोतल पर एक बोतल दारू फ्री –
— Sachin Gupta (@SachinGuptaUP) March 25, 2025
उत्तर प्रदेश के शराब ठेके वालों को 31 मार्च की रात 12 बजे तक सारा स्टॉक खत्म करना है। वरना बची हुई दारू सरकारी खाते में जमा हो जाएगी और उसकी बिक्री नहीं हो पाएगी। इसलिए ठेके वाले ग्राहकों को खूब ऑफर दे रहे हैं। Video नोएडा की है। pic.twitter.com/hCLD9sxleu
మందుబాబులను కంట్రోల్ చేయడానికి
పొడవైన క్యూలు, రద్దీ, తోసుకోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. మందుబాబులను కంట్రోల్ చేయడానికి పోలీసులను మోహరించాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గడువు ముగిశాక ప్రభుత్వం ఆ మద్యాన్ని సీజ్ చేసే అవకాశం ఉండటంతో వ్యాపారులు ఇలా చేసినట్లు సమాచారం. కాగా 2025-26 సంవత్సరానికి కొత్త ఎక్సైజ్ విధానం అమలులోకి రానుంది. ఏప్రిల్ 1 నుండి ఇ-లాటరీ వ్యవస్థ ద్వారా కొత్త దుకాణాలు తెరవబడతాయి. కాబట్టి మద్యం దుకాణాలు 2025 మార్చి 31 నాటికి తమ స్టాక్‌ను క్లియర్ చేయాల్సి ఉంటుంది.
🔴 मुजफ्फरनगर: शराब के ठेकों पर उमड़ा शराबियों का सैलाब 🔴
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) March 25, 2025
🍾 1 बोतल पर 1 बोतल फ्री ऑफर के चलते भारी भीड़
🏪 दुकानदार पुराने स्टॉक को खत्म करने में जुटे
🚨 भोपा रोड स्थित शराब ठेके पर अफरा-तफरी का माहौल#Muzaffarnagar #LiquorSale #FreeOffer #Crowd #Alcohol @muzafarnagarpol… pic.twitter.com/8DDvQROrF2
Also read : PF Withdraw -Atm: ఇక ఏటీఎం నుంచి పీఎఫ్ నగదు తీసుకోవచ్చు...ఎప్పటి నుంచో తెలుసా?