బీజేపీ ఎమ్మెల్యేపై దాడి.. పోలీసుల ముందే గల్లాపట్టి కొట్టిన అడ్వకేట్!

యూపీలోని లఖింపూర్‌లో బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ వర్మపై దాడి జరిగింది. పోలీసుల ముందే బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అవధేష్ సింగ్ గల్లాపట్టి కొట్టారు. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల నేపథ్యంలో ఈ గొడవ జరగగా.. వీడియో వైరల్ అవుతోంది.

New Update

Yoges Varma: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ వర్మపై బహిరంగంగా దాడి చేయడం కలకలం రేపింది. పదుల సంఖ్యలో పోలీసుల సమక్షంలోనే బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అవధేష్ సింగ్ ఎమ్మెల్యేపై చెప్పుతో కొట్టారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఈ మేరకు పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల విషయంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అవధేష్ సింగ్, సదరు ఎమ్మెల్యే యోగేష్ వర్మ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం మొదలైంది. దీంతో కోపోద్రిక్తుడైన అవధేష్ సింగ్ పోలీసుల ఎదుటే ఎమ్మెల్యే యోగేష్ వర్మపై దాడికి పాల్పడ్డాడు. అడ్వకేట్స్ అంతా ఎమ్మెల్యేను చుట్టుముట్టారు. దీంతో ఎమ్మెల్యే, ఆయన సహచరులు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిపై దాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అతి కష్టం మీద పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను విడదీశారు. 

అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్‌కు ఎన్నికల నేపథ్యంలో..

ఈ ఘటన అనంతరం ఎమ్మెల్యే యోగేష్ వర్మ మీడియాతో మాట్లాడుతూ.. 'అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్‌కు ఎన్నికల నేపథ్యంలో నామినేషన్లు వేసేందుకు బీజేపీ కార్యకర్తలు వచ్చారు. ఈ సమయంలోనే బార్ అసోషియేషన్ వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించారు. మొదట ట్రేడ్ యూనియన్ నాయకుడు రాజు అగర్వాల్‌ను కొట్టి కరపత్రాన్ని చించివేశారు. నేను అతనిని పరామర్శించేదుకు వస్తే న్యాయవాది అవధేష్ సింగ్ నాపై దాడి చేశాడు' అని చెప్పారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mamata Banerjee: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆధునిక జిన్నా: తరుణ్ చుగ్

పశ్చిమ బెంగాల్‌లో హింసకు మమతా బెనర్జీ సమాధానం చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అల్లర్లు చెలరేగుతుంటే ముఖ్యమంత్రి మౌనంగా ఉండటాన్ని ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు ఖండించారు. తరుణ్ చుగ్ మమతా బెనర్జీని ఆదునిక జిన్నాతో పోల్చారు.

author-image
By K Mohan
New Update
CM Mamata Banerjee: నీతి ఆయోగ్ సమావేశం నుంచి సీఎం మమతా బెనర్జీ వాకౌట్‌

వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడే విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. వక్ఫ్ సవరణ చట్టం 2025 పై పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ లో తీవ్ర అసంతృ‌ప్తి జ్వాలలు ఎగిపిపడుతున్నాయి. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నానికి ప్రతిపక్షాలు అడ్డుతగులుతున్నాయి. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం 2025 బిజెపిని ప్రశంసించి తగిన ఒక సాహసోపేతమైన చర్య.

ఈ చట్టానికి వ్యతిరేకంగా భారతదేశంలోని అనేక నగరాల్లో నిరసనలు చెలరేగాయి. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ లో హింసా కాండ మొదలైంది. అక్కడ హిందూ కుటుంబాలను లక్ష్యంగా చేసుకున్నారు. దుకాణాలను దోచుకున్నారు. మరియు శుక్రవారం ప్రార్థనల తర్వాత ముస్లిం గుంపులు అల్లర్లు చెలరేగడంతో సంఘాలు పారిపోవాల్సి వచ్చింది. అల్లర్లు లేపి రాళ్లు రువ్వడం, వాహనాలు ధ్వంస చేయడం, నిప్పంటించడం వంటి హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా సీఎం మమతా బెనర్జీ నోరు మెదపడం లేదని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. హింసాకాండ జరిగిన ప్రాంతం నుంచి భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇలాంటి చర్యలు ఉగ్రవాదం అదుపు లేకుండా విజృంభిస్తోందనడానికి ఇది స్పష్టమైన నిదర్శనమని బిజెపి విమర్శించింది. అల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. సుకాంత మజుందార్, దిలీప్ ఘోష్ , ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ వంటి సీనియర్ రాష్ట్ర బిజెపి నాయకులు టిఎంసి మౌనాన్ని విమర్శించారు. హిందువులను వారి ఇళ్ల నుండి వెళ్ళగొట్టేటప్పుడు టిఎంసి కళ్ళు మూసుకుందని ఆరోపించారు.

Also read: Waqf Board Act: వక్ఫ్ బోర్డు చట్టంలో కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

ముర్షిదాబాద్‌లో అత్యంత దారుణమైన హింస జరిగినప్పటికీ, ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, పాట్నా, సిల్చార్, లక్నో, తమిళనాడులోని హోసూర్ వంటి నగరాల్లో నిరసనలు చెలరేగాయి. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ చట్టాన్ని తిరస్కరించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అస్సాంలోని సిల్చార్‌లో, నిరసనలు హింసాత్మకంగా మారాయి, పోలీసులతో జనాలు ఘర్షణ పడ్డారు. ఢిల్లీలోని జామా మసీదులో నిరసనలు శాంతియుతంగా ఉన్నాయి. బీజేపీ మాత్రం ఎన్ని నిరసనలు వస్తున్నా వక్ఫ్ చట్టం విషయంలో వెనక్కి తగ్గేతే లేదని తేల్చి చెప్పింది. బిజెపి నాయకుడు తరుణ్ చుగ్ మమతా బెనర్జీని ఆధునిక జిన్నాతో పోల్చారు, మైనారిటీ సంతృప్తి కోసం ఆమె హిందువుల భద్రత తాకట్టు పెట్టారని ఆరోపించారు. ముర్షిదాబాద్‌లో ముగ్గురు వ్యక్తుల మరణాలపై ఆమె మౌనాన్ని ఆయన ఖండించారు. 

Advertisment
Advertisment
Advertisment