పొట్టు పొట్టు కొట్టుకున్న లాయర్లు, జడ్జి.. పోలీసుల ఎంట్రీతో (వీడియో) యూపీ ఘజియాబాద్ జిల్లా కోర్టులో రచ్చ జరిగింది. ఓ బెయిల్ పిటిషన్ విషయంలో జడ్జి, లాయర్ మధ్య గొడవతో వివాదం మొదలైంది. గొడవ పెద్దది కావడంతో పోలీసుల ఎంట్రీ ఇచ్చారు. లాయర్లపై లాఠీఛార్జ్ చేశారు. ఈ గొడవలో పలువురు లాయర్లకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. By Seetha Ram 29 Oct 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి యూపీ ఘజియాబాద్ జిల్లా కోర్టులో విచిత్రం జరిగింది. లా అండ్ ఆర్డర్‌ని కాపాడాల్సిన న్యాయస్థానాలు అల్లర్లకు దిగాయి. గొడవలు, తగాదాలను ఆపాల్సిన వారే కోర్టులో రచ్చ రచ్చ చేశారు. అవును మీరు విన్నది నిజమే. కోర్టులో జడ్జి, లాయర్ల మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. ఇది కూడా చదవండి: 'రేవంత్‌ను చంపేందుకు కుట్ర' ఏకంగా ఒకరిపై ఒకరు చేయి చేసుకునేంత వరకు వెళ్ళారు. మధ్యలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఎంత చెప్పినా వినకపోవడంతో లాయర్లపై లాఠీఛార్జ్ చేశారు. ఇందులో దాదాపు 10 మందికి పైగా లాయర్లు తీవ్రంగా గాయపడ్డారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇది కూడా చదవండి: మేడిగడ్డ అందుకే కుంగింది.. విజిలెన్స్ రిపోర్ట్ లో సంచలన అంశాలు! జిల్లా సెషన్స్ కోర్టులో ఉద్రిక్తత యూపీ ఘజియాబాద్ జిల్లా సెషన్స్ కోర్టులో జడ్జి అనిల్ కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో ప్రాసిక్యూషన్ ప్రత్యేక విచారణ కోసం కేసును వాయిదా వేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. అయితే తమ వంతు వచ్చే వరకు వెయిట్ చేయాలని జడ్జ్ వారికి సూచించారు. ఇది కూడా చదవండి: సీఎం రేవంత్‌కు ముప్పు.. సెక్యూరిటీ మార్పు! దీంతో న్యాయవాదులు అసంతృప్తి చెంది కోర్టు ఆవరణలో కేకలు వేశారు. ఆపై పరిస్థితి అదుపు తప్పింది. జడ్జ్, న్యాయవాదుల మధ్య ఘర్షణ మొదలైంది. ఈ ఘర్షణ కారణంగా కోర్టు పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. జడ్జ్, లాయర్లకు మధ్య మాటా మాటా పెరిగింది. #Ghaziabad कोर्ट में वकीलों और जज में हुई झड़प, पुलिस ने वकीलों को कोर्ट रूम से बाहर खदेड़ा, कोर्ट रूम के अंदर लाठियां चली, कुर्सियां फेंकी गईं। एक केस की सुनवाई के दौरान ये झड़प हुई थी pic.twitter.com/vsAiYeKrzr — Akash Garg (@gargakash6957) October 29, 2024 ఇది కూడా చదవండి: బాంబ్ బెదిరింపులు.. 62 విమానాలు రద్దు! న్యాయవాదులపై లాఠీఛార్జ్ అక్కడితో ఆగకుండా చేయిచేసుకునేంత వరకు వెళ్లింది. ఇక లాభంలేదని జస్టిస్ కుమార్ పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులను పిలిచారు. దీంతో రంగలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదర గొట్టేందుకు లాఠీలకు పనిచెప్పారు. న్యాయవాదులపై లాఠీఛార్జ్ చేశారు. ఆపై పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పారామిలీటరీ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఘటనలో దాదాపు 8 నుంచి 10 మంది న్యాయవాదులు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. #viral-videos #ghaziabad-viral-video మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి