/rtv/media/media_files/2026/04/17/modi-2026-04-17-21-51-35.jpg)
రేపు కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశం కానుంది. దీంతో ఈ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉదయం 11:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ భేటీ, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయ పరిణామాల నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సాధారణంగా కేబినెట్ సమావేశాలు బుధవారం జరగనున్నాయి.
ప్రభుత్వం అధికారికంగా అజెండాను ప్రకటించకపోయినప్పటికీ, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో వస్తున్న మార్పులే ప్రధాన చర్చాంశం కావొచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధిని ఇరాన్ తిరిగి తెరిచిన నేపథ్యంలో, చమురు సరఫరా పునరుద్ధరణ భారత్ వంటి దేశాలకు పెద్ద ఊరటనిచ్చే అంశం. దీనివల్ల దేశీయంగా ఇంధన ధరల తగ్గింపు లేదా ఆర్థిక వెసులుబాటుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
పశ్చిమ ఆసియాలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా విదేశీ వాణిజ్య విధానాల్లో మార్పులు చేయడం, పారిశ్రామిక వృద్ధిని పెంచేందుకు కొత్త ఆర్థిక సంస్కరణలను ప్రకటించడం వంటివి ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యం కావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఆర్టికల్ 370 రద్దు వంటి సంచలన నిర్ణయాలకు ఇలాంటి ఆకస్మిక భేటీలే వేదికయ్యాయి.
తదుపరి కార్యాచరణను
శుక్రవారం లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు (మహిళా రిజర్వేషన్) వీగిపోయిన నేపథ్యంలో, ప్రభుత్వం తన తదుపరి కార్యాచరణను ఈ భేటీలో చర్చించనుంది. ప్రతిపక్షాల వ్యూహాన్ని ఎలా తిప్పికొట్టాలి? లేదా సవరణలతో కూడిన కొత్త బిల్లును తీసుకురావాలా? అనే కోణంలో మంత్రులతో ప్రధాని చర్చించే అవకాశం ఉంది.
Follow Us