Union Budget 2025: రైతులకు బడ్జెట్లో వరాల జల్లు.. ధన్ ధాన్య యోజన స్కీమ్.. 1.7 కోట్ల మందికి బెనిఫిట్

బడ్జెట్‌‌లో కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తను తెలిపింది. పీఎం ధన్ ధాన్య కృషి యోజన పేరుతో కొత్త పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ద్వారా 1.7 కోట్ల గ్రామీణ రైతులకు లబ్ధి చేకూరనుంది. 

New Update
india

Finance Minister Nirmala Sitaraman

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తను తెలిపింది. పీఎం ధన్ ధాన్య కృషి యోజన పేరుతో కొత్త పథకాన్ని ప్రకటించారు. దేశంలో వెనుకబడిన జిల్లాలో వ్యవసాయానికి ప్రోత్సాహం అందేలా కొత్త పథకాన్ని తీసుకొస్తున్నారు. ఈ పథకం ద్వారా గోదాములు, నీటిపారుదల, రుణ సౌకర్యాల కల్పన వంటివి అభివృద్ధి చేయనున్నారు. మొత్తం 1.7 కోట్ల గ్రామీణ రైతులకు లబ్ధి చేకూరనుంది.

పేదలు, యువత, మహిళలు, రైతుల అభ్యున్నతిపై దృష్టి సారిస్తానని సీతారామన్ అన్నారు. వ్యవసాయ వృద్ధి, గ్రామీణాభివృద్ధి, తయారీపై కేంద్ర దృష్టి సారించింది. మొత్తం 100 జిల్లాల్లో ధన్ ధాన్య యోజనను ప్రారంభిస్తున్నట్లు నిర్మలమ్మ తెలిపారు. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు. మఖానా సాగు చేసే రైతులకు కూడా మేలు జరుగుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అలాగే అస్సాంలో యూరియా ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. యూరియా సరఫరాను పెంచేందుకు ప్రభుత్వం అస్సాంలోని నామ్‌రూప్‌లో ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది.

 

updating..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు