Union Budget 2025: సామాన్యులకు గుడ్ న్యూస్.. తక్కువ ధరకే మొబైల్స్

ప్రజలు ఎక్కువగా వినియోగించే మొబైల్, దుస్తులు, టీవీలు తక్కువ ధరకే లభిస్తాయని బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మొత్తం 36 రకాల మందులు తక్కువ ధరకు లభించనున్నాయి. అలాగే భారత్‌లో తయారయ్యేవి కూడా తక్కువ ధరకే లభించనున్నాయి.

New Update
Budget 2025 Live

Nirmala Sitaraman

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో సామాన్యులకు గుడ్ న్యూస్ తెలిపారు. ప్రజలు ఎక్కువగా వినియోగించే మొబైల్, దుస్తులు, టీవీలు తక్కువ ధరకే లభిస్తాయని వెల్లడించారు. భారత్‌లో తయారయ్యే దుస్తులు, మొబైల్స్, లెదర్ వస్తువులు, ఎల్‌ఈడీ, స్మార్ట్ టీవీలు, ఎలక్ట్రానిక్ వాహనాలు అన్ని కూడా తక్కువ ధరకే లభించనున్నాయి. మొత్తం 36 రకాల మందులను తక్కువ ధరకే ఇవ్వనున్నట్లు తెలిపారు. దేశంలో తక్కువ ఖర్చులతో ఉత్పత్తి చేయడం వల్ల వీటిని చౌక ధరకే ఇవ్వనున్నట్లు తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు