Ranya Rao gold smuggling case: రన్యా రావుతో ఇద్దరు మంత్రులకు లింక్‌..బీజేపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్‌

విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా చేస్తూ కన్నడ నటి రన్యారావు పట్టుబడిన విషయం తెలిసిందే. కాగా రన్యారావు బంగారం స్మగ్లింగ్‌ విషయంలో దర్యాప్తు కొనసాగుతుండగా ఆమెపై రోజుకో ఆరోపణ వస్తోంది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్  సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Update
 Ranya Rao

 Ranya Rao

Ranya Rao gold smuggling case: విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా చేస్తూ కన్నడ నటి రన్యారావు పట్టుబడిన విషయం తెలిసిందే. కాగా రన్యారావు బంగారం స్మగ్లింగ్‌ విషయంలో దర్యాప్తు కొనసాగుతుండగా ఆమెపై రోజుకో ఆరోపణ వస్తోంది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్  సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన కీలక కామెంట్స్‌ చేశారు. ఆయన మాట్లాడుతూ.. సోమవారం సభలో మొత్తం కేసు గురించి మాట్లాడుతానని అన్నారు. రన్యా రావుతో పరిచయం ఉన్న ఇద్దరు మంత్రుల పేర్లను సభలో చెబుతాను. నేను ఇప్పుడు మీడియా ముందు దాని గురించి మాట్లాడను. ఆమెకు ప్రోటోకాల్ ఇచ్చిన వారి గురించి మేము సమాచారాన్ని సేకరించాం. వాళ్ళకి బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి కోసం తెచ్చారో నాకు తెలుసు.” అని యత్నాల్ అన్నారు.

ఇది కూడా చూడండి: Telangana Budget: తెలంగాణలో భారీ బడ్జెట్.. ఈసారి ఎన్ని లక్షల కోట్లంటే ?

రన్యా కేసులో కేంద్ర కస్టమ్స్ అధికారులు కూడా తప్పులు చేశారని మంత్రి సంతోష్ లాడ్ ఆరోపించారు. ఈ అంశంపై యత్నాల్ స్పందిస్తూ, “ఎవరు తప్పు చేసినా, అది తప్పే” అని అన్నారు. కస్టమ్స్ అధికారులు తప్పు చేస్తే, మేం వారిని సమర్థించడం లేదు. రన్యాకు KIADB(కర్ణాట ఇండస్ట్రీయల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ బోర్డ్‌) 12 ఎకరాల భూమి ఇచ్చిన అంశంపై స్పందిస్తూ, మురుగేష్ నిరానీ స్వయంగా ఆ భూమిని తానే ఇచ్చానని అంగీకరించారు. అయితే డబ్బు చెల్లించకపోవడంతో దాన్ని రద్దు చేశారు. 12 ఎకరాల భూమికి ఎవరో డబ్బు చెల్లించడానికి ముందుకొచ్చారు. వాళ్ళు ఇవ్వలేదు. అందువల్ల, భూమి కేటాయింపును రద్దు చేసినట్లు ఆయన తెలిపారు.

ఇది కూడా చూడండి: PAK Vs BLA: రెండు ముక్కలుగా పాక్.. మరో దేశంగా అవతరించనున్న బలూచ్!

మరోవైపు కస్టడీలో తనను టార్చర్‌ చేస్తున్నారంటూ రన్యా రావు కోర్టుకు వెల్లడించిన విషయం తెలిసిందే. తెల్ల కాగితంపై తన సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు. కనీసం నిద్ర పోనివ్వకుండా, తిండి కూడా తిననివ్వడం లేదంటూ ఫిర్యాదు చేశారు. కాగా, రన్యా రావు కేసు విషయంలో ఎయిర్‌ పోర్టులో ప్రోటోకాల్‌ ఉల్లంఘన వెనుక ఆమె సవితి తండ్రి, ఐపీఎస్‌ అధికారి రామచంద్రరావు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో, ఆయన పాత్రపై విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. 

Also read: Starbucks : తంతే స్టార్‌బగ్స్‌లో పడ్డాడు.. డెలవరీ బాయ్‌కి రూ. 434 కోట్ల నష్టపరిహారం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు