Video: పట్టపగలే ఇద్దరు చిన్నారుల కిడ్నాప్.. తండ్రే కారణం..! దుండగులు పట్టపగలే ఇద్దరు పిల్లల్ని కిడ్నాప్ చేసిన ఘటన బెంగళూరులో జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. నిందితుల నుంచి ఆ పిల్లల తండ్రి డబ్బులు తీసుకోగా.. వాటిని తిరిగి ఇవ్వక పోవడంతోనే కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. By Seetha Ram 25 Oct 2024 in నేషనల్ క్రైం New Update షేర్ చేయండి ఈ మధ్య కాలంలో చిన్నారుల కిడ్నాప్ వ్యవహారాలు ఎక్కువైపోయాయి. ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు చిన్నారులను కిడ్నాప్ చేసి తమ పేరెంట్స్ నుంచి డబ్బులు గుంజుతున్నారు. మరికొందరు తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదని.. ఎలాగైన తమ డబ్బులు రాబట్టాలని పిల్లల్ని కిడ్నాప్ చేసి రాబడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఇది కూడా చదవండి: భారత్‌కు ఉగ్రవాది హెచ్చరిక.. రేపటి నుంచి! ఇద్దరు దుండగులు పట్ట పగలే ఓ ఇంట్లోకి దర్జాగా వచ్చి పిల్లలను కిడ్నాప్ చేసిన ఘటన బెంగళూరులో జరిగింది. మంచినీళ్ల పేరుతో ఓ ఇంట్లోకి వచ్చిన కిడ్నాపర్లు.. అక్కడే చిన్నారులతో ఆడుకుంటున్న అమ్మమ్మను తాగడానికి మంచినీళ్లు అడిగారు. వారికి నీళ్లు ఇచ్చేందుకు ఆ వృద్ధురాలు ఇంట్లోకి వెళ్ళగానే దుండగులు పిల్లలతో పరార్ అయ్యారు. వీడియో వైరల్ ఇది కూడా చదవండి: రూ.500 బోనస్ ఇచ్చే సన్న రకాలు ఇవే! పిల్లలను తీసుకుని పరిగెడుతున్న వీడియో సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగలను పట్టుకున్నారు. ఇందులో భాగంగానే పోలీసులు ఆ ఇద్దరు పిల్లలను కాపాడగా.. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆ నిందితులను పట్టుకునే క్రమంలో పోలీసులపై రాళ్లు రువ్వి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఇది కూడా చదవండి: కాటేసిన కాళేశ్వరం.. కేసీఆర్‌కు బిగ్ షాక్! నిందితుడి కాలుపై కాల్పులు దీంతో పోలీసులు నిందితుడి కాలుపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడి కాలికి తీవ్ర గాయం అయింది. ఈ ముగ్గురు నిందితుల్లో ఇద్దరిది మహారాష్ట్ర కాగా.. ఒకరిది బీహార్ అని పోలీసులు గుర్తించారు. డబ్బు కోసమే పిల్లలను కిడ్నాప్ చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఇది కూడా చదవండి: ఇవి ఉంటేనే ఉచిత గ్యాస్ సిలిండర్లు.. మంత్రి సంచలన ప్రకటన! అయితే తండ్రి కారణంగానే ఆ ఇద్దరు పిల్లలు కిడ్నాప్‌కి గురైనట్లు తెలుస్తోంది. నిందితుల వద్ద డబ్బులు తీసుకున్న ఆ ఇద్దరి పిల్లల తండ్రి వాటిని డబుల్ చేసి ఇస్తానని వారికి హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే డబ్బులు ఇవ్వకుండా నిందితులను మోసం చేయడంతో వారు పిల్లలను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. #crime-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి