/rtv/media/media_files/2026/03/09/cbi-summons-vijay-again-for-questioning-in-karur-stampede-probe-on-tuesday-2026-03-09-15-08-50.jpg)
CBI summons Vijay again for questioning in Karur stampede probe on Tuesday
తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కింది. కోలీవుడ్ సూపర్ స్టార్ నుంచి పొలిటికల్ లీడర్‌గా మారిన దళపతి విజయ్, తన రాజకీయ ప్రస్థానంలో అత్యంత కీలకమైన అడుగు వేశారు. సోమవారం చెన్నైలోని పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా విజయ్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
విజయ్ ఆస్తుల లెక్కలివే..
విజయ్ సమర్పించిన అఫిడవిట్ ప్రకారం, ఆయనకు మొత్తం రూ. 404.58 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి. ఇందులో భారీ బ్యాంక్ డిపాజిట్లు, వివిధ కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన గ్యారేజీలోని విలాసవంతమైన కార్ల వివరాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. విజయ్ వద్ద BMW 530, BMW i7, టయోటా లెక్సస్ 350, టయోటా వెల్‌ఫైర్ వంటి ఖరీదైన వాహనాలు ఉన్నట్లు పేర్కొన్నారు.
ఆదాయం విషయానికొస్తే, 2021-22 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ. 237.46 కోట్లు, గత ఏడాది (2024-25) రూ. 184.53 కోట్లు ఆదాయాన్ని సంపాధించినట్లు వెల్లడించారు. నామినేషన్ అనంతరం విజయ్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల్లో తన పార్టీ TVK అభ్యర్థులను గెలిపించాలని, ‘విజిల్’ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
డీఎంకే మాస్టర్ ప్లాన్: మహిళలకు రూ. 8,000 కూపన్లు!
మరోవైపు, విజయ్ ఎంట్రీని దీటుగా ఎదుర్కొనేందుకు అధికార DMK భారీ అస్త్రాన్ని ప్రయోగించింది. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ విడుదల చేసిన మేనిఫెస్టోలో మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా ఒక వినూత్న పథకాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని మహిళలకు రూ. 8,000 విలువైన ప్రత్యేక కూపన్లను అందజేస్తామని సీఎం హామీ ఇచ్చారు. నగదు రూపంలో ఇస్తే ఇతర ఖర్చులకు ఖర్చవుతుందని భావించిన స్టాలిన్, వీటిని కూపన్ల రూపంలో ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కూపన్లతో మహిళలు తమకు నచ్చిన వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌లు, టీవీలు లేదా మిక్సర్ల వంటి గృహోపకరణాలను కొనుగోలు చేసుకోవచ్చు.
దళపతి విజయ్ భారీ ఆస్తుల ప్రకటన, అటు అధికార పార్టీ వరాల జల్లుతో తమిళనాడులో ముక్కోణపు పోటీ నెలకొంది. అగ్ర హీరో ఇమేజ్‌తో రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది? డీఎంకే ఉచిత పథకాలు మహిళా ఓటర్లను మళ్ళిస్తాయా? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. ఏప్రిల్ 23న జరిగే పోలింగ్ తమిళనాడు భవిష్యత్తును తేల్చనుంది.
Follow Us