/rtv/media/media_files/2025/03/02/K9IDl08yj9qdQbLxIqZ6.jpg)
Trump USAID Impact 3 Transgender Clinics Close
Transgenders: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా అందిస్తున్న యూఎస్ ఎయిడ్‌ను నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో పలు దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఇందులో భారత్ కూడా ఉంది. యూఎస్ ఎయిడ్ నిలిచిపోవడంతో ఇండియాలోని ట్రాన్స్‌జెండర్ల కోసం ఏర్పాటుచేసిన 3 క్లినిక్‌లు మూతపడ్డట్లు తెలుస్తోంది. ఈ మేరకు 2021లో హైదరాబాద్‌లో మొదటి ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌ను ప్రారంభించగా పూణే, కళ్యాణ్ నగరాల్లో కూడా ఈ క్లినిక్‌లు ఏర్పాటు చేశారు. అయితే ట్రంప్ యూఎస్ ఎయిడ్‌ను నిలిపివేయడంతో ఇండియాలో 5 వేల మందికి మెడికల్ ట్రీట్‌మెంట్ అందట్లేదని సమాచారం.
120 దేశాలకు మానవతా సాయం..
ఈ క్లినిక్‌లో ట్రాన్స్‌జెండర్లకు హార్మోన్ థెరపీపై అవగాహన కల్పిస్తున్నారు. మందులు, మానసిక ఆరోగ్యంతో పాటు HIV, లైంగిక వ్యాధులపై కౌన్సెలింగ్ ఇస్తారు. వైద్య సంరక్షణ, న్యాయ సహాయం సహా వివిధ సేవలను అందించారు. ఈ సేవలందించడానికి ఒక్కరికీ ఏడాదికి రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇక ప్రపంచంలోని 120 దేశాలకు మానవతా సాయం చేయడంతోపాటు ఆయా దేశాల అభివృద్ధి, భద్రతకు భరోసానిచ్చేందుకు అమెరికా యూఎస్ ఎయిడ్‌ను ప్రారంభించింది. వందల కోట్ల డాలర్లను సాయంగా అందిస్తోంది. అయితే ప్రభుత్వ వృథా ఖర్చులను తగ్గించేందుకు ఎలాన్ మస్క్ నేతృత్వంలో డోజ్‌ను ఏర్పాటు చేసిన ట్రంప్.. యూఎస్ ఎయిడ్ వృథా ఖర్చులు ఎక్కువగా చేస్తోందని చెప్పారు.
Also read : Asha Workers: ఆశా వర్కర్లకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా..!
యూఎస్ ఎయిడ్ ను నేరగాళ్ల సంస్థ..
అంతేకాదు యూఎస్ ఎయిడ్ ను నేరగాళ్ల సంస్థ ఎలాన్ మస్క్ పేర్కొనడం గమనార్హం. కాగా అమెరికా పౌరులు చెల్లిస్తున్న పన్నులతో ఏ దేశాలు బాగుపడుతున్నాయో, ఎవరికి నిధులు వెళ్తున్నాయో ఇప్పటికైనా అర్థం అయ్యిందా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే.. అమెరికాలో కొంతకాలం యూఎస్‌ఎయిడ్ సేవలను నిలిపివేస్తున్నట్లు ట్రంప్ వెల్లడించడంతో వేలాది మంది ఉద్యోగులను తొలగించింది.
Also Read : రెచ్చిపోయిన దొంగలు.. నాలుగు నిమిషాల్లోనే ఏటీఎంను కట్ చేసి ..