/rtv/media/media_files/2026/02/03/trump-2026-02-03-14-44-54.jpg)
అమెరికా భారత్ సంబంధాల గురించి చెప్పుకోవాలంటే పహల్గామ్ అటాక్ తర్వాత, ముందు అని చెప్పుకొవచ్చు. అప్పటి వరకు మోదీ ఫ్రెండ్ అన్న ట్రంప్ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్‌కు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. తర్వాత రష్యా నుంచి చమురు కొంటున్నందుకు మన మీద పీకల దాకా పగ పెంచుకుండు. సుంకాల మీద సుంకాలు పెంచి 50శాతానికి టారీఫ్‌లు పెంచాడు. అమెరికాలో భారతీయ విద్యార్ధులపై కూడా కర్కక్షంగా వ్యవహరించారు. ఇండియాని టారిఫ్ కింగ్ అని కూడా ట్రంప్ పిలిచాడు. అంతేకాదు ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి కూడా ఇండియానే కారణమని అన్నాడు. రష్యా నుంచి చమురు కొన్ని యుద్దాన్ని ప్రోత్సహిస్తుందని అగ్రరాజ్యం అధ్యక్షుడు చెప్పుకొచ్చాడు. రష్యా నుంచి భారత్‌ను దూరం చేద్దామని అన్ని విధాలా ప్రయత్నించి ట్రంప్ భంగపడ్డాడు. గత కొన్ని నెలలుగా భారత్‌పై విషం చిమ్ముతూ వచ్చిన ట్రంప్ ఎట్టకేలకు దిగి వచ్చాడు. 50శాతంగా ఉన్న టారీఫ్‌లను 18శాతానికి తగ్గించారు. గత కొన్ని నెలలుగా చర్చలు నడిచిన వాణిజ్య చర్యలు ఫలించి అమెరికా, భారత్‌ల మళ్లీ ఫ్రెండ్లీ వాతావరణాన్ని తీసుకోచ్చాయి. తాజాగా అమెరికా, భారత్‌పై కుదిరిన ట్రేడ్ డీల్ కారణంగా ఇండియా రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేస్తుందని ట్రంప్ ప్రకటించాడు. దీనిపై భారత్ క్లారిటీ ఇవ్వలేదు. ట్రంప్‌పై ఇండియా పైచేయి సాధించింది.
ఇప్పటికీ భారత్.. రష్యా నుంచి చమురు నిల్వలు కొనడం అమెరికాకు నచ్చడం లేదు. భారత్ మూడు దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ ఎక్కువగా కొనుగోలు చేస్తోంది. అమెరికా, సౌదీ, రష్యా. అమెరికా నుంచి భారత్ కొనే చమురు ధర సుమారు $78 - $82 (షిప్పింగ్ ఖర్చులతో కలిపి) మధ్య ఉండవచ్చు. రష్యా కంటే ఇది కొంచెం ఖరీదైనదే అయినప్పటికీ, డాలర్లలో చెల్లింపులు సులభం కావడం, దీర్ఘకాలిక సరఫరా హామీ ఉండటం వల్ల భారత్ దీనికి మొగ్గు చూపుతోంది.
రష్యా భారత్‌కు ఇచ్చే చమురు ధర అంతర్జాతీయ బెంచ్ మార్క్ కంటే సుమారు $5 నుండి $8 డాలర్లు తక్కువగా (డిస్కౌంట్) ఉంటోంది. ఉదాహరణకు అంతర్జాతీయ ధర $80 ఉంటే, భారత్ సుమారు $72 - $75 మధ్య కొనుగోలు చేస్తోంది. గతంలో ఈ డిస్కౌంట్ $20 - $30 వరకు ఉండేది, కానీ ఇప్పుడు అది గణనీయంగా తగ్గింది. అలాగే ఇరాక్, సౌదీ దేశాలు $77 - $80 లకు క్రూడ్ ఆయిల్ అమ్ముతున్నాయి. దీనికి కారణం తక్కువ రవాణా ఖర్చు, భౌగోళిక సామీప్యత.
Follow Us