/rtv/media/media_files/2026/05/10/fotojet-2026-05-10-10-59-13.jpg)
Trisha is a special attraction at Vijay's swearing-in ceremony.
Trisha : తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా 'దళపతి' జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సరికొత్త రాజకీయ చరిత్రకు నాంది పలకడమే కాకుండా, వ్యక్తిగత బంధాలు, సామాజిక మాధ్యమాల్లోని హాట్ టాపిక్స్‌పై చర్చలకు మరోసారి ప్రధాన కేంద్రంగా మారింది. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా ఆదివారం అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకలో విజయ్‌తో పాటు మరో విశిష్ట వ్యక్తి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమే.. స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్. విజయ్ ప్రమాణ స్వీకార వేడుకతో పాటు ఆయన వ్యక్తిగత జీవితం చుట్టూ నడుస్తున్న చర్చలకు దారి తీసింది.
#WATCH | Tamil Nadu: Actor Trisha Krishnan at the Jawaharlal Nehru Stadium in Chennai, where TVK Chief C Joseph Vijay will take oath as the Chief Minister of Tamil Nadu, shortly. pic.twitter.com/oCevs6N1Wx
— ANI (@ANI) May 10, 2026
నీలి రంగు చీరలో మెరిసిన త్రిష..
ప్రమాణ స్వీకారోత్సవానికి కొద్దిసేపటి ముందే హీరోయిన్ త్రిష తన తల్లి హేమతో కలిసి చెన్నైలోని తన నివాసం నుంచి బయలుదేరి నెహ్రూ ఇండోర్ స్టేడియానికి చేరుకున్నారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమం కోసం త్రిష నీలి రంగు (బ్లూ కలర్) పట్టుచీర ధరించి, తలలో మల్లెపూలు పెట్టుకుని అచ్చమైన సంప్రదాయబద్ధంగా మెరిసిపోయారు.స్టేడియంలోకి ఆమె అడుగుపెట్టిన విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో క్షణాల్లో వైరల్‌గా మారాయి. విజయ్ అభిమానులు, టీవీకే శ్రేణులు ఆమె రాకను విపరీతంగా షేర్ చేస్తూ నెట్టింట హల్చల్ సృష్టించారు.
గతంలో ఎన్నికల ఫలితాలు వెల్లడై, విజయ్ ఘనవిజయం సాధించిన రోజే త్రిష హుటాహుటిన ఆయన నివాసానికి వెళ్లి అభినందించారు. ఆ సమయంలో మీడియా కెమెరాల ముందుకు నేరుగా రాకుండా ముఖం చాటేసినప్పటికీ, తన కారులో నుంచే 'విక్టరీ' (V) సింబల్ చూపిస్తూ చేసిన హావభావాలు అప్పట్లో పెద్ద సంచలనంగా మారాయి.
#WATCH | Tamil Nadu: On a reporter's question- "big day for Tamil Nadu", actor Trisha Krishnan says, "Thank you, looking forward," as she leaves from her residence in Chennai pic.twitter.com/qdEAnfP2q8
— ANI (@ANI) May 10, 2026
రాజకీయ వేదికపై త్రిష ఇలా తళుక్కున మెరవడంతో, గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య నడుస్తోందంటూ ప్రచారంలో ఉన్న వ్యక్తిగత సంబంధాల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. విజయ్, త్రిషల జంట వెండితెరపై ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. అయితే, గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందంటూ కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తూ.. విజయ్ భార్య సంగీత ఆయనకు విడాకుల నోటీసులు పంపినట్లు ప్రచారం సాగింది. సదరు నోటీసులలో, విజయ్ గత రెండేళ్లుగా తమ కుటుంబంతో కలిసి ఉండటం లేదని, ఒక ప్రముఖ హీరోయిన్‌తోనే ఆయన ఎక్కువగా గడుపుతున్నారనే తీవ్ర ఆరోపణలు చేసినట్లు ఆ వార్తల సారాంశం.సంగీత ఆరోపించిన సదరు హీరోయిన్ త్రిషనే అంటూ సోషల్ మీడియా కోడైకూసింది. దీనికి తోడు, ఇటీవల జరిగిన ఒక ప్రైవేట్ ఫంక్షన్‌కు విజయ్, త్రిష కలిసి హాజరుకావడంతో వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై నెటిజన్లలో ఒక స్పష్టత వచ్చిందంటూ కామెంట్లు వ్యక్తమయ్యాయి.
వ్యక్తిగత జీవితంపై ఎలాంటి ప్రచారాలు సాగుతున్నప్పటికీ, విజయ్ క్రేజ్ మాత్రం రవ్వంతైనా తగ్గలేదు. ప్రమాణ స్వీకార వేదిక వద్దకు విజయ్ వైట్ షర్ట్, పంచెతో అత్యంత సాధారణమైన క్లీన్ లుక్‌లో రాగా.. స్టేడియం మొత్తం ఆయన నినాదాలతో దద్దరిల్లిపోయింది. విజయ్ విజయాన్ని ఆకాంక్షిస్తూ గతంలో కొందరు అభిమానులు ముఖానికి ఇనుప ఈటెలు గుచ్చుకుని మొక్కులు తీర్చుకోగా, మరికొందరు అత్యుత్సాహంతో ఆత్మహత్యాయత్నాలకు కూడా పాల్పడిన ఘటనలు ఆయనకున్న విపరీతమైన మాస్ ఇమేజ్‌ను చాటిచెబుతున్నాయి. ఏదేమైనా, అటు రాజకీయ వైభవం, ఇటు వ్యక్తిగత చర్చల నడుమ దళపతి విజయ్ తమిళనాడు 21వ ముఖ్యమంత్రిగా తన సరికొత్త ప్రస్థానాన్ని ప్రారంభించారు.
Follow Us