Vijay : విజయ్ ఇంట్లో త్రిష బర్త్ డే సెలబ్రెషన్స్.. కేక్ కట్ చేయించిన విజయ్!

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. విజయ్ TVK పార్టీ అధికారం దిశగా కొనసాగుతుంది. ఈ క్రమంలో ఆయన నివాసానికి త్రిష వెళ్లారు. తిరుమల నుంచి  నేరుగా చెన్నైలోని  విజయ్ ఇంటికి వెళ్లిన త్రిష.. ఆయనను కలిసి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.

New Update
Trisha

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. విజయ్ TVK పార్టీ అధికారం దిశగా కొనసాగుతుంది. ఈ క్రమంలో ఆయన నివాసానికి త్రిష వెళ్లారు. తిరుమల నుంచి  నేరుగా చెన్నైలోని  విజయ్ ఇంటికి వెళ్లిన త్రిష.. ఆయనను కలిసి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ రోజు త్రిష పుట్టిన రోజు కావడంతో ఆమెకు విజయ్ శుభాకాంక్షలు తెలిపారు.  అలాగే కేక్ కట్ చేయించినట్లుగా తెలుస్తోంది. నా పుట్టినరోజు నాడు విజయ్ సాధించిన ఈ రాజకీయ విజయమే నాకు అతిపెద్ద గిఫ్ట్ అంటూ త్రిష అన్నట్లు సమాచారం.  విజయ్ ఇంటి బయట వేలాది మంది అభిమానులు టీవీకే జెండాలతో సందడి చేస్తుండగా, లోపల త్రిష బర్త్‌డే వేడుకలు జరగడం అందరి దృష్టిని ఆకర్షించింది. విజయ్ పార్టీ 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.  ఏఐఏడీఎంకే నేతృత్వంలోని కూటమి 76 స్థానాల్లో ముందంజలో ఉంది. డీఎంకే కూటమి అభ్యర్థులు 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

Advertisment
తాజా కథనాలు