సీతారం ఏచూరికి అంతిమ విడ్కోలు.. భౌతికకాయం ఎయిమ్స్‌కు అప్పగింత !

సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి భౌతికకాయాన్ని ఎకేజీ భవన్‌ నుంచి ఎయిమ్స్‌కు తరలిస్తున్నారు. అక్కడికి చేరుకున్నాక ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు ఎయిమ్స్‌కు అప్పగించనున్నారు.

New Update
Sitaram Yechuri

కమ్యూనిస్టు యోధుడు, సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి భౌతికకాయాన్ని శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం ఎకేజీ భవన్‌కు తరలించారు. దివంగత నేతకు నివాళులర్పించేందుకు సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు, పార్టీ శ్రేణులు, వివిధ రాజకీయ పార్టీ ప్రముఖులు తరలివచ్చారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, సీనియర్ నేత జైరాం రమేష్, ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ అలాగే ప్రముఖ చరిత్రకారిణి ప్రొఫెసర్ రొమిల్లా థాపర్ తదితరులు ఏచూరికి నివాళులర్పించారు. 

Also Read: వైద్యుల నిరసన శిబిరానికి వెళ్లిన సీఎం మమతా బెనర్జీ..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, తమిళనాడు, అస్సాం, గుజరాత్, ఢిల్లీ, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి వచ్చిన సీపీఐ(ఎం) నేతలు ఆయనకు నివాళులర్పించారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎకేజీ భవన్‌ నుంచి ఎయిమ్స్‌ వరకు అంతిమ యాత్ర మొదలైంది. అక్కడికి చేరుకున్నాక ఏచూరి భౌతిక కాయాన్ని ఎయిమ్స్‌కు కుటుంబ సభ్యులు అప్పగించనున్నారు.

శుక్రవారం సాయంత్రమే ఎయిమ్స్‌ నుంచి జేఎన్‌యూకి ఏచూరి భౌతిక కాయాన్ని విద్యార్థుల సందర్శనార్థం తీసుకొచ్చారు. సాయంత్రం 4 గంటల వరకు అక్కడ నివాళులర్పించే కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సందర్శనార్థం వసంత్‌ కుంజ్‌లోని నివసానికి తరలించారు. ఏచూరికి చైనా రాయబారి జు ఫీహాంగ్‌ సైతం నివాళులర్పించారు. ఇదిలాఉండగా ఏచూరి భౌతికకాయాన్ని పరిశోధన, బోధన కోసం ఎయిమ్స్‌కు అప్పగించడాన్ని దేశవ్యాప్తంగా నెటీజన్లు హర్షిస్తున్నారు. సోషల్‌ మీడియాలో లాల్‌ సలాం కామ్రేడ్ అంటూ పోస్టులు పెడుతున్నారు.

Also Read: హైదరాబాద్‌ లో కొత్త రైల్వే స్టేషన్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Attack: ఉగ్రదాడి వేళ.. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు కీలక నిర్ణయం

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అక్కడి ఆటోలు, ట్యాక్సీ డ్రైవర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్యాటకుల వద్ద ఎలాంటి రుసుం తీసుకోకుండానే ఉచితంగానే వాళ్ల గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. మరికొందరు స్థానికులు కూడా వాళ్లకు ఫ్రీగానే ఆశ్రయం కల్పిస్తున్నారు.

New Update
Kashmiris' generosity during terror attacks, Free transport for tourists

Kashmiris' generosity during terror attacks, Free transport for tourists

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అక్కడున్న పర్యాటకులు భయంతో వణికిపోతున్నారు. దీంతో అక్కడి ఆటోలు, ట్యాక్సీ డ్రైవర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. 

Also Read: ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

పర్యాటకుల వద్ద ఎలాంటి రుసుం తీసుకోకుండానే ఉచితంగానే వాళ్ల గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. మరికొందరు స్థానికులు కూడా వాళ్లకు ఫ్రీగానే ఆశ్రయం కల్పిస్తున్నారు. అయితే దీనిపై ఓ ఆటో డ్రైవర్ మాట్లాడారు. '' ఇది కేవలం టూరిస్టుల మీద మాత్రమే జరిగిన దాడి కాదు. కశ్మీర్‌ ఆత్మపై జరిగినటువంటి దాడి. టూరిస్టులు మాకు అతిథులుగా వచ్చారు. ఉగ్రదాడి వల్ల ఇప్పుడు భయాందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితిని చూస్తే చాలా బాధగా అనిపిస్తోంది.  

Also Read: హిమాచల్ ప్రదేశ్ లో హై అలెర్ట్..ఉగ్రదాడి జరగొచ్చనే హెచ్చరికలు

కొత్తగా పెళ్లైన ఓ జంట భయంతో వణుకుతూ నా దగ్గరికి వచ్చారు. ఎయిర్‌పోర్టుకు ఎలా వెళ్లాలని అడిగారు. దీంతో నేను వాళ్లని సురక్షితంగా దిగబెట్టాను. వాళ్లు నాకు డబ్బులిచ్చేందుకు యత్నించారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ల నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలి. అందుకే నేను తీసుకోలేదు. అలాగే ఆటో, ట్యాక్సి డ్రైవర్లందరం కూడా ఇప్పుడున్న పరిస్థితి దృష్ట్యా పర్యటకుల నుంచి డబ్బులు తీసుకోవడం లేదని'' ఆ ఆటో డ్రైవర్ తెలిపారు. 

Also Read: టిఆర్‌ఎఫ్ ముసుగులో లష్కర్ ఈ తోయిబా దాడులు.. ఆన్‌లైన్‌లో యువకుల రిక్రూట్‌మెంట్!

Also Read: అఘోరీకి దిమ్మతిరిగే షాక్.. 10 ఏళ్లు జైల్లోనే - లాయర్ సంచలన వ్యాఖ్యలు

Short News | Latest News In Telugu | నేషనల్ TRF | rtv-news | national-news 

Advertisment
Advertisment
Advertisment