/rtv/media/media_files/2025/02/19/0xmTp54Ky3s6OgNXUXnc.jpg)
Traffic restrictions 1 Photograph: (Traffic restrictions 1)
మెట్రో లైన్ విస్తరణ పనుల్లో భాగంగా బెంగుళూర్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పిల్లర్ నంబర్ 163 నుంచి 167 వరకున్న 4 పిల్లర్ల నిర్మాణ పనులు ప్రారంభమైయ్యాయి. ఆ రూట్‌లో ఉన్న ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డులో ట్రాపిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ఫిబ్రవరి 19న ట్రాఫిక్ పోలీసులు ప్రకటన జారీ చేశారు. ఈ పనులు దాదాపు 45 రోజుల పాటు జరగనున్నాయి. దీంతో పోలీసులు అటు వైపు బారికెట్ల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా మార్గాల్లో నెమ్మదిగా వాహనాల రాకపోకలు ఉంటాయని పేర్కొన్నారు.
Also Read: ఏపీలో వీసీల నియామకం.. యూనివర్సిటీల వారీగా లిస్ట్ ఇదే!
Traffic Advisory. @DCPSouthTrBCP @Jointcptraffic @CPBlr @blrcitytraffic @BlrCityPolice @acphsrtrps @acpwfieldtrf @halairporttrfps @DCPTrEastBCP @hsrltrafficps @madivalatrfps @wftrps @0RRCA pic.twitter.com/RLJiI9TWn4
— BELLANDURU TRAFFIC BTP (@bellandurutrfps) February 19, 2025
ఔటర్ రింగ్ రోడ్ 27వ మెయిన్ రోడ్ ఫ్లైఓవర్ నుంచి ఇబ్బలూరు గవర్నమెంట్ స్కూల్ వరకు ర్యాంప్ దిగువన ఉన్న సర్వీస్ రోడ్డు, మెయిన్ రోడ్డు రెండింటిలోనూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ రూట్‌లో వెళ్లే వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను పాటించి సహరించాలని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రకాష్ దేవరాజ్ ప్రజలను కోరారు.
Also Read: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ బాధ్యతలు!