Punjab Singer: రేవంత్ సర్కార్‌పై టాప్ సింగర్ సంచలన వ్యాఖ్యలు

టాప్ పంజాబీ సింగర్ దిల్జీజ్‌ దోసాంజ్‌‌‌ మద్యాన్ని ప్రేరేపించే విధంగా పాటలు పాడటంతో రేవంత్ సర్కార్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ కాన్సర్ట్‌లో దిల్జీజ్ మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాల్లో మద్యం నిషేధిస్తే అలాంటి పాటలు పాడటం మానేస్తానన్నాడు.

New Update
Diljit Dosanjh

ప్రముఖ పంజాబీ సింగర్ దిల్జీజ్‌ దోసాంజ్‌‌కి తెలంగాణ ప్రభుత్వం నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కాన్సర్ట్‌లో అతను మద్యానికి సపోర్ట్‌గా పాటలు పాడారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో కూడా ఓ మ్యూజిక్ కాన్సర్ట్ ఉండటంతో రేవంత్ సర్కార్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. మద్యం, డ్రగ్స్, హింసను సపోర్ట్ చేసే విధంగా ఎలాంటి పాటలు పాడకూడదని సింగర్ దిల్జీజ్‌ దోసాంజ్‌‌కి ముందుగానే ఆంక్షలు విధిస్తూ నోటీసులు జారీ చేసింది.

ఇది కూడా చూడండి: BIG BREAKING: వైసీపీ ఎమ్మెల్యేకు నోటీసులు

ఇది కూడా చూడండి: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన కీలకనేత

అన్ని రాష్ట్రాల్లో మద్యపానం నిషేధం విధిస్తే..

ఇటీవల గుజరాత్‌లో జరిగిన ఓ కాన్సర్ట్‌‌లో సందడి చేసిన దిల్జీజ్‌ దోసాంజ్‌‌ తెలంగాణ ప్రభుత్వం పంపిన నోటీసులకు స్పందించారు. విదేశాలు నుంచి పాటలు పాడే సింగర్లపై ఎలాంటి ఆంక్షలు విధించరని, కానీ సొంత దేశంలో  పాటలు పాడితే ఆంక్షలు విధించడం కరెక్ట్ కాదన్నారు. అన్ని రాష్ట్రాల్లో మద్యపానం నిషేధిస్తే అప్పుడు తాను అలాంటి పాటలు పాడటం మానేస్తానన్నాడు.

ఇది కూడా చూడండి:  BIG BREAKING: హైదరాబాద్‌లో ఐటీ దాడులు

బాలీవుడ్ పాటలు కంటే తన పాటల్లో తక్కువగా మద్యం గురించి ప్రస్తావన ఉందన్నారు. బాలీవుడ్ సినిమాల్లోని పాటల స్టెప్‌లు కూడా మద్యానికి ప్రోత్సహించేలా ఉంటాయని దిల్జీజ్‌ దోసాంజ్‌‌ అన్నారు. మిగతా సెలబ్రిటీల్లా తాను మద్యం బ్రాండ్‌ను ప్రమోట్ చేయడంలేదు, బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం లేదనే వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ టాప్ సింగర్ ఒక్కో కాన్సర్ట్‌కి దాదాపుగా రూ.50 లక్షల నుంచి కోటి వరకు ఛార్జ్ చేస్తారట. ఇతని కాన్సర్ట్ అంటే భారీగా జనం వెళ్తుంటారు. 

ఇది కూడా చూడండి:  అతి తక్కువ టైంలో లక్ష లైక్స్ అందుకున్న టాలీవుడ్ ట్రైలర్స్

Advertisment
Advertisment
తాజా కథనాలు