Jahangir : బెంగాల్ వీధుల్లో అంకుశం సీన్ రిపీట్ ..  షార్ట్ వేసి, తాడు కట్టి మరీ లాక్కెళ్లారు!

రాజశేఖర్ హీరోగా నటించిన అకుశం సినిమా గుర్తుంది కదా.. ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా రాజశేఖర్, విలన్ రామిరెడ్డిని నడిరోడ్డుపై లాక్కెళ్లిన సీన్ గుర్తుంది కదా? సరిగ్గా అలాంటి సినిమా సీనే పశ్చిమ బెంగాల్‌ వీధుల్లో అలాంటి సీనే రిపీట్ అయింది.

New Update
TMC

కోడి రామకృష్ణ  డైరెక్షన్ లో  రాజశేఖర్ హీరోగా నటించిన అకుశం సినిమా గుర్తుంది కదా.. ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా రాజశేఖర్, విలన్ రామిరెడ్డిని నడిరోడ్డుపై లాక్కెళ్లిన సీన్ గుర్తుంది కదా? సరిగ్గా అలాంటి సినిమా సీనే పశ్చిమ బెంగాల్‌ వీధుల్లో అలాంటి సీనే రిపీట్ అయింది.

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఫాల్తా పుష్పగా గుర్తింపు తెచ్చుకున్న తృణమూల్ కాంగ్రెస్ వివాదాస్పద నేత జహంగీర్ ఖాన్‌కు నడిరోడ్డుపై తీవ్ర అవమానం ఎదురైంది. అరెస్ట్ అయినప్పటి నుంచి పోలీసులు ఆయనను వీధుల్లో ఊరేగించడం ఇది మూడోసారి. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో జహంగీర్ ఖాన్ కేవలం షార్ట్ టీ-షర్ట్ ధరించి, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నడుస్తూ కనిపించారు. ఆయన నడుముకు తాడు కట్టి, చేతులు జోడించి ప్రజలకు క్షమాపణలు చెబుతూ, కొన్ని చోట్ల రెండు చెవులూ పట్టుకుని వీధుల్లో నడుస్తుండటం తీవ్ర సంచలనంగా మారింది. చుట్టూ భారీ భద్రత నడుమ పోలీసులు ఆయనను నడిపించారు.

బెంగాల్‌లోని డైమండ్ హార్బర్ ప్రాంతానికి చెందిన ఈ బలమైన నాయకుడిని దోపిడీలు, భూకబ్జాలు, ఎన్నికల అనంతర హింస వంటి తీవ్రమైన ఆరోపణలపై ఈ నెల జూన్ 8వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆయనకు ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. బెంగాల్ క్రైమ్ సీన్ రీ-కన్స్ట్రక్షన్ ప్రక్రియలో భాగంగా దర్యాప్తు సంస్థలు ఆయనను ఫాల్తా, సహరార్హత్ పరిసర ప్రాంతాల్లోని వీధుల్లోకి తీసుకువచ్చాయి. ఆయన దాచిపెట్టిన డబ్బును, నేరాలకు పాల్పడిన ప్రదేశాలను గుర్తించేందుకే ఇలా తీసుకువచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే, ఒక నిందితుడిని నడుముకు తాడు కట్టి, ఇలా అవమానకరంగా వీధుల్లో తిప్పడంపై కలకత్తా హైకోర్టు స్పందిస్తూ పోలీసుల నుంచి నివేదిక కోరింది.  

ఫాల్తా నియోజకవర్గం నుంచి పోటీ

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫాల్తా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జహంగీర్ ఖాన్, మే 21న జరిగిన రీ-పోలింగ్‌కు కేవలం రెండు రోజుల ముందే హఠాత్తుగా తప్పుకుంటున్నట్లు ప్రకటించి అదృశ్యమయ్యారు. ఆ తర్వాత భారత్-నేపాల్ సరిహద్దుల్లోని పానిటాంకి ప్రాంతం గుండా దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయనను పట్టుకున్నారు. ఆయనపై ఫాల్తా పోలీస్ స్టేషన్‌లో ప్రస్తుతం సుమారు ఏడు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 

Advertisment
తాజా కథనాలు