సల్మాన్‌కు సహకరిస్తే చావే..లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్ సల్మాన్ ఖాన్‌కు సహకరిస్తే సిద్ధికీ పట్టిన గతే పడుతుందని హెచ్చరిస్తోంది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్ అయిన శుభమ్ రామేశ్వర్ లోంకర్ అనే వ్యక్తి ఫేస్ బుక్ వేదికగా ఈ వార్నింగ్ ఇచ్చారు.దావూద్ కు సాయం చేసినా కూడా ఇదే గతని అంటున్నారు. By Manogna alamuru 13 Oct 2024 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Lawrence Bishnoi Gang: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యకు బాధ్యత వహిస్తున్నట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, అండర్ వరల్డ్ ఫిగర్లు దావూద్ ఇబ్రహీం, అనుజ్ థాపన్‌లతో సిద్ధిఖీకి ఉన్న సన్నిహితం వల్ల ఈ హత్య చేశామని గ్యాంగ్‌లోని ఓ సభ్యుడు చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు దుండగులను ఇప్పటికే అరెస్టు చేసినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రకటించారు. “ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ముంబై పోలీసు చీఫ్ చెప్పారు. వారిలో ఒకరు యూపీకి చెందినవారు కాగా, మరొకరు హర్యానాకు చెందినవారు. మూడో దుండగుడు పరారీలో ఉన్నట్లు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు చెప్పినట్లు,” షిండే తెలిపారు. మొదట నుంచి సిద్దిఖీ హత్య వెనుక కారణం సల్మాన్ ఖాన్ తో సాన్నిహిత్యమే అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఎప్పుడైతే తామే ఈ హత్య చేశామని ప్రకటించిందో...అప్పటి నుంచీ అ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు ఇదే నిజమని ఆ గ్యాంగ్ సభ్యుడు ఒకరు పోస్ట్ కూడా పెట్టారు. సల్మాన్ ఖాన్‌కు సహకరిస్తే..ఎవరైనా చావాల్సిందే అంటున్నారు. సిద్దిఖీకి పట్టిన గతే వారికీ పడుతుందని అంటూ బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్ అయిన శుభమ్ రామేశ్వర్ లోంకర్ అనే వ్యక్తి ఫేస్ బుక్ లో వార్నింగ్ ఇచ్చారు. భారతదేశానికి చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంతో సంబంధం ఉన్నందునే సిద్ధిక్ హత్యకు గురయ్యాడని, సల్మాన్ ఖాన్‌తో సన్నిహితంగా ఉన్నాడని పోస్టులో రాశాడు. దీంతో పాటూ సల్మాన్ ఇంటి బయటి కాల్పుల నిందితుడు అనూజ్ థాపన్ పోలీస్ కస్టడీలో మరణించిన విషయాన్ని కూడా తన పోస్ట్‌లో ప్రస్తావించాడు లోంకర్. అనూజ్‌ను పోలీసలు జైల్లో చిత్రహింసలు పెట్టారని...అతని కుటుంబ స్యులను కూడా హింసించారని లోంకర్ తన పోస్ట్‌లో ప్రస్తావించాడు. తమకు ఎవరితో శత్రుత్వం లేదని..కానీ సల్మాన్, దావూద్ గ్యాంగ్‌కు ఎవరైనా సహాయం చేస్తే మాత్రం ఊరుకోమని హెచ్చిరించారు. అయితే లోంకర్ పేరుతో పెట్టిన ఎఫ్‌బీ పోసట్ నిజంగా వాళ్ళు పెట్టిందేనా లేక మరెవరైనా ఫేక్ ది క్రియేట్ చేశారా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ పోస్ట్‌ను ఇంకా ధవీకరించాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. సిద్ధిక్ , సల్మాన్ ఖాన్ మంచి మిత్రులు. సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ మధ్య విభేదాలను పరిష్కరించడంలో సిద్ధిక్ మధ్యవర్తిత్వం వహించారు. 2013లో ఇఫ్తార్ విందులో ఇద్దరి మధ్య విభేదాలను పరిష్కరించారు. Also Read: AP: ముంచుకొస్తున్న అల్ప పీడనం..24 గంటల్లో భారీ వర్షాలు మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి