/rtv/media/media_files/2025/05/16/ZS08Xw8ioRztzg1vmKtY.jpg)
PM Modi
Prime Minister Modi : నియోజకవర్గాల పునర్విభజనపై ప్రధాని మోడీ లోక్‌సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ చరిత్రలోనే ఇది కీలక ఘట్టమని ఆయన వ్యాఖ్యానించారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ఆయన గురువారం లోక్‌సభలో మాట్లాడారు. 30 ఏళ్ల క్రితం ఆమోదించాల్సిన బిల్లు ఇప్పుడు సభ ముందుకు వచ్చిందని ప్రధాని అన్నారు. దేశ చరిత్రలో ఎన్నో కీలక ఘట్టాలు ఉంటాయని, ఇది కూడా అలాంటి సమయమేనని చెప్పుకొచ్చారు. సమయాన్ని బట్టి మనం కూడా మారుతూ ఉండాలని ప్రధాని సూచించారు. ఈ బిల్లు దేశ చరిత్రలోనే గొప్పదని తెలిపిన ప్రధాని పార్లమెంట్‌కు ఇదో కీలక సువర్ణావకాశం అని ప్రధాని వ్యాఖ్యానించారు.దేశంలోని సగం జనాభాకు అధికారం ఇవ్వడం ఒక అద్భుత అవకాశంగా పేర్కొన్నారు. బిల్లులో చిన్న రాష్ట్రం ,పెద్ద రాష్ర్టం అనే భేదాలు మాకు లేవు అన్నారు. ఈ బిల్లులో ఎవరిపట్ల వివక్ష ఉండదన్నారు. ఉత్తర భారతదేశం, దక్షణ భారతదేశం అనే తేడా మాకు లేదని మాకు దేశమంతా ఒక్కటేనని ప్రధాని స్పష్టం చేశారు. ఏ ప్రాంతానికి అన్యాయం జరగదని హామీ ఇస్తున్నానన్నారు. దక్షిణాది, ఉత్తరాది, తూర్పు ఏ రాష్ట్రానికిఅన్యాయం జరగదన్నారు. డీ లిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మాకు సమానమే..చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగదు.
దీనికి నా మాటే గ్యారెంటీ అన్నారు. స్వార్థం కోసమే బిల్లు తెచ్చారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు..బిల్లును విపక్షాలు వ్యతిరేకిస్తే మాకే లాభం అన్నారు.
మహిళ రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడుతూ మహిళలకు అధికారం ఉంటేనే వికసిత్ భారత్ సాధ్యమని. అని, దేశాన్ని సరికొత్త దిశలోకి మార్చే చర్యలు చేపడుతున్నామని అన్నారు. మహిళలకు అధికారం ఇస్తే వారు కొత్త మార్గాన్ని చూపిస్తారని పేర్కొన్నారు. మహిళా బిల్లు దేశ చరిత్రలోనే అద్భుతమని కొనియాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు దిష్టి తగలకుండా చూడాలన్నారు.
మహిళా బిల్లు ద్వారా చరిత్ర సృష్టించబోతున్నామని ప్రధాని మోడీ అన్నారు. దేశాభివృద్ధిలో మహిళ పాత్ర చాలా ముఖ్యమని, ఈ బిల్లును వ్యతిరేకించే వారిని మహిళా లోకం క్షమించదని హెచ్చరించారు. 2024లోనే మహిళా బిల్లుకు విపక్షాలు అంగీకరించాయని గుర్తుచేశారు. దశాబ్దంగా ఈ బిల్లును అణచి పెట్టా్రు, ఇపుడు ఆమోదించి ప్రాయశ్చిత్తం చేసుకుందాం అన్నారు. సాంకేతిక కారణాలు చూపించి 30 ఏళ్లపాటు మహిళా బిల్లును అడ్డుకున్నారన్నారు. ఈ బిల్లును తీసుకు రాగానే కొందరు విభజన రాజకీయాలు చేస్తున్నారని మోదీ మండిపడ్డారు.
మహిళల్లో రాజకీయ చైతన్యం పెరిగిందన్న ఆయన ఈ బిల్లుకు మద్దతు ఇచ్చే వారికే రాజకీయ మనుగడ ఉంటుందని అన్నారు. పంచాయతీల్లోనే కాదు అత్యున్నత చట్టసభల్లోనూ మహిళలు భాగస్వామ్యం కోరుకుంటున్నారు. మహిళా రిజర్వేషన్లకు రాజకీయ రంగు పులమొద్దు.. మహిళా బిల్లు ఇప్పుడు లోక్‌సభ ముందుకు వస్తే బిల్లును అడ్డుకుంటున్నారని విపక్షాలపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బిల్లు తీసుకురావడంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. తమకు అన్యాయం చేసేవారిని మహిళలు అదునుచూసి దెబ్బకొడుతారని వార్నింగ్ ఇచ్చారు. విపక్షాల నేతలు తమ పదవులు కోల్పోతామనే భయంతో బిల్లుకు మద్దతు ఇవ్వడం లేదని ఆరోపించారు. నేడు అధికశాతం జిల్లా పరిషత్తులు మహిళల చేతుల్లోనే ఉన్నాయని మోడీ గుర్తు చేశారు.
ఇది రాజకీయ పార్టీల కోసం తెచ్చిన బిల్లు కాదని ప్రధాని మోదీ అన్నారు, దేశ ప్రజల కోసం తెచ్చిన బిల్లు అని మోడీ స్పష్టం చేశారు. నేడు దేశంలో అన్ని రంగాల్లో మహిళలు సత్తా చాటుతున్నారని, ఈ బిల్లును ఎప్పుడో తీసుకురావల్సిందని, గత ప్రభత్వాలు ఈ బిల్లు తీసుకురావడంలో విఫలమయ్యాయని మండిపడ్డారు. రాజకీయాల్లో తమ శక్తిని చూపించడానికి మహిళలు సిద్ధంగా ఉన్నారని, గ్రామస్థాయిలో మహిళలు రాజకీయాల్లో భాగం కావడం వల్ల వారికి రాజకీయ అవగాహన పెరిగిందని అన్నారు. పంచాయతీల్లో రిజర్వేషన్లు ఉన్నప్పుడు, పార్లమెంట్‌లో ఉందుకు ఉండకూడదని ప్రధాని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్లపై మాకు క్రెడిట్ కూడా అవసరం లేదు. ఆ క్రెడిట్ అంతా మీరే తీసుకోండిఅన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలుపుతాం..అందరూ అనుకూలంగా ఉంటే.. ఈ బిల్లు ఎందుకు ఆగిపోతుంది? అంటూ ప్రదాని ప్రశ్నించారు.
Follow Us