నేటి నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే! పన్నుల విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఈరోజు నుంచి అమలు కానున్నాయి. ఆధార్ కార్డు, సబ్సిడీ, పీపీఎఫ్ రేట్లు, షేర్లు బైబ్యాక్, బాండ్లులో కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పులు ఈ రోజు నుంచి మారనున్నాయి. By Kusuma 01 Oct 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి కేంద్ర ప్రభుత్వం పన్నుల విధానంలో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని అమల్లోకి రాగా.. నేటి నుంచి మరికొన్ని అమల్లోకి రానున్నాయి. మరి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఏంటో చూద్దాం. ఆధార్ కార్డు పన్ను రిటర్నులు దాఖలు లేదా పాన్ కార్డు దరఖాస్తు చేయడానికి ఆధార్ లేదా ఎన్‌రోల్‌మెంట్ ఐడీ ఏదో ఒకటి ఉంటే చాలు. కానీ ఇకపై కేవలం ఆధార్ ఉంటే సరిపోతుంది. సబ్సిడీ ఈరోజు నుంచి ప్రధానమంత్రి ఇ డ్రైవ్ యోజన స్కీం అమల్లోకి రానుంది. ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు కొనేవారికి సబ్సిడీ కింద రూ.50వేలు లభించనున్నాయి. ఆస్తి అమ్మకాల్లో.. ఈరోజు నుంచి ఎవరైనా రూ.50 లక్షల కంటే ఎక్కువ స్థిరాస్తి ఆస్తులను విక్రయిస్తే 1 శాతం టీడీఎస్ ప్రభుత్వానికి కట్టాలి. పీపీఎఫ్ రేట్లు మైనర్లు మేజర్లు అయిన తర్వాత పీపీఎఫ్ వడ్డీ రేట్లు వర్తించే కొత్త రూల్ ఈరోజు నుంచి అమల్లోకి రానుంది. షేర్లు బైబ్యాక్ సాధారణంగా కంపెనీలు షేర్లను బైబ్యాక్ చేస్తే.. సంస్థలకు పన్ను బాధ్యత ఉండేది. కానీ ఇప్పుడు వాటాదారులకు బదిలీ అయ్యింది. బాండ్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన బాండ్ల వడ్డీకి 10శాతం పన్ను కోత వర్తిస్తుంది. బాండ్లపై వచ్చిన రాబడి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 వేల కంటే ఎక్కువ ఉంటే టీడీఎస్ విధిస్తారు. ఇది కూడా చూడండి: దారుణం.. ఉరేసి, గొంతు కోసి ఆర్‌ఎంపీ డాక్టర్ భార్య హత్య #aadhaar-card #central-government #new-rules మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి