కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపారు. ఏటా రూ.12 లక్షల కంటే తక్కువ ఉన్నవారి ఆదాయంపై పన్ను ఉండదని ఆర్థిక మంత్రి వెల్లడించారు. అలాగే ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు కాల పరిమితిని 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రూ.12 నుంచి రూ.16 లక్షల ఆదాయం ఉన్నవారికి 15 శాతం ఆదాయపు పన్ను విధించారు. రూ.20 నుంచి రూ.24 లక్షల ఆదాయంపై 20 శాతం, రూ.24 లక్షల కంటే ఎక్కువ ఆదాయంపై 30 శాతం పన్ను విధించినట్లు తెలిపారు.
#UnionBudget2025 | Finance Minister Nirmala Sitharaman says, " I am now happy to announce that there will be no income tax up to an income of Rs 12 lakhs." pic.twitter.com/rDUEulG3b9
— ANI (@ANI) February 1, 2025