/rtv/media/media_files/2026/05/26/fotojet-7-2026-05-26-06-29-35.jpg)
ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే హజ్ యాత్ర నేటి నుంచి సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో ప్రారంభమైంది. ఇస్లాం మతంలోని ఐదు ముఖ్యమైన విధుల్లో హజ్ యాత్ర ఒకటి. ఏటా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ముస్లింలు ఈ పవిత్ర యాత్రలో పాల్గొంటారు. ఈ ఏడాది కూడా యాత్రలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో మక్కాకు చేరుకున్నారు. యాత్రలో భాగంగా తొలిరోజున మక్కాలోని ప్రసిద్ధ గ్రాండ్ మాస్క్‌లో వేలాది మంది యాత్రికులు పవిత్ర కాబా చుట్టూ ప్రదక్షిణలు చేశారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌదీ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
ఇది కూడా చూడండి: Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’కి ఊహించని షాక్.. ఆందోళనలో మూవీ టీమ్!
Batches of Hujjaj continue to head towards Arafat. pic.twitter.com/yGBw3Govup
— The Holy Mosques (@theholymosques) May 26, 2026
ఇది కూడా చూడండి: Total Fertility Rate : భారత్‌లో పడిపోతున్న జననాల రేటు (TFR)..... చైనా బాటలో దేశం.. ఆందోళనలో నిపుణులు!
భారీగా చేరుకున్న ముస్లింలు..
ఈ ఏడాది హజ్ యాత్ర కోసం విదేశాల నుంచి సుమారు 15 లక్షల మంది ముస్లింలు సౌదీ అరేబియాకు చేరుకున్నారు. వీరందరికీ మక్కాలో వసతి, రవాణా, ఆరోగ్య సదుపాయాలను అధికారులు కల్పిస్తున్నారు. యాత్రికుల తాకిడి ఎక్కువగా ఉండటంతో.. రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. హజ్ యాత్ర సందర్భంగా ఈసారి సౌదీ ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన నిబంధనలను విధించింది. పండుగ రోజుల్లో గోవులు, ఒంటెల వధపై పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయానికి సంబంధించి యాత్రికులకు కఠినమైన సూచనలు జారీ చేశారు. హజ్ యాత్రలో బలి ఇచ్చే సంప్రదాయం కోసం గొర్రెలను మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. యాత్రికులందరూ ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించాలని, దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఇది కూడా చూడండి: Pawan Kalyan : శత్రువులు మన పార్టీలోనే ఉన్నారు... ప్రొ. నాగేశ్వర్ కామెంట్స్ వివాదంపై పవన్ కళ్యాణ్ సంచలనం!
☪️ You wanted to be there,, you're not..and it's hurt..
— Tannie تاني 🇵🇸 (@putin_76) May 26, 2026
He invited them by name, if you are not there this year it's not because He forgots you, it's because your invitation has not arrived yet
Your Hajj is coming.. Until then make this Arafah count from wherever you are ❤ 🕋 pic.twitter.com/WDjDmjkFSs
ఇది కూడా చూడండి: CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయాలు...రైతులకు పూర్తి రుణమాఫీ.. సినిమాలకు ఐదో షో అనుమతి!
Follow Us