Lashkar e Taiba Co founder Amir Hamza : ఉగ్రసంస్థ ఎల్‌ఈటీ నాయకుడిపై కాల్పులు. .పరిస్థితి విషమం

పాక్‌ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థ  లష్కర్-ఏ-తోయిబా(ఎల్‌ఈటీ)  సహ వ్యవస్థాపకుడు ఆమిర్ హమ్జాపై లాహోర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ల్లో తీవ్రంగా గాయపడ్డ అతడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

New Update
FotoJet (78)

Amir Hamza

Lashkar e Taiba Co founder Amir Hamza : పాక్‌ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థ  లష్కర్-ఏ-తోయిబా(ఎల్‌ఈటీ)  సహ వ్యవస్థాపకుడు ఆమిర్ హమ్జాపై లాహోర్‌లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పల్లో తీవ్రంగా గాయపడ్డ అతడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థకు సహవ్యవస్థాపకుడుగా ఉన్న అమిర్‌ హమ్జాపై లాహోర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అమిర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.లాహోర్‌లోని ఒక న్యూస్‌ ఛానల్‌ కార్యాలయం బయట ఆయన ఉండగా ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఆమిర్ హమ్జాపై కాల్పులు జరిపిన అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. తీవ్ర గాయాలపాలైన హమ్జాను ఆయన అనుచరులు ఆసుపత్రిలో చేర్పించగా ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు లాహోర్‌ వర్గాలు చెబుతున్నాయి.  

ఇంతకీ హమ్జా ఎవరంటే?

ఆమిర్ హమ్జా అఫ్గాన్ జీహాదీ గ్రూపులకు చెందిన వ్యక్తి. అయితే ఇతను1980లో మరో ఉగ్రవాది అయిన హఫీజ్ సయీద్‌తో కలిసి లష్కర్-ఏ-తోయిబా (ఎల్‌ఈటీ) ని స్థాపించాడు. ఈ తీవ్రవాద సంస్థ భారత్‌తో పాలు ఇతర దేశాల్లో దాడులకు పాల్పడుతూ వస్తోంది. మనదేశంలో జరిగిన అనేక దాడులకు హమ్జా  సూత్రధారిగా ఉన్నాడు. తన ప్రసంగాలు, ఉగ్రవాదాన్ని ప్రేరేపించే రచనలతో పాక్‌లో చాలా గుర్తింపు పొందాడు. ఎల్‌ఈటీ పత్రికకు వ్యవస్థాపక ఎడిటర్‌గా కూడా కొంతకాలం పని చేశాడు .. ఎల్‌ఈటీ గ్రూపు కీలక నాయకుల్లో హమ్జా ఒకడిగా ఉన్నాడు. ఉగ్రవాదులను చేర్చుకోవడం, నిధుల సమీకరణ వంటి కార్యకలాపాలను హమ్జా నిర్వహిస్తుంటాడని తేలుస్తోంది. ఎల్‌ఈటీని విదేశీ టెర్రరిస్టు సంస్థగా అమెరికా ఇప్పటికే ప్రకటించింది. హమ్జాను కూడా టెర్రరిస్టుగా పేర్కొన్న విషయం తెల్సిందే.

Advertisment
తాజా కథనాలు