IARI: ఐఏఆర్ఐ డైరెక్టర్‌‌గా తెలుగు వ్యక్తి

భారత వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్‌‌గా చెరుకుమల్లి శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఐఏఆర్ఐ కు ఒక తెలుగు వ్యక్తి డైరెక్టర్ కావడం ఇదే మొదటిసారి. ఈయన ప్రస్తుతం ఎన్‌ఏఏఆర్ఎమ్ లో డైరెక్టర్‌‌గా ఉన్నారు.

New Update
director

Ch.Srinivasa Rao

భారత వ్యవసాయ పరిశోధన సంస్థకు డైరెక్టర్‌‌గా మొట్టమొదటిసారి ఒక తెలుగు వ్యక్తిని నియమించారు. ప్రస్తుతం నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌గా ఉన్న శ్రీనివాసరావును ఐఏఆర్ఐకు డైరెక్టర్‌‌గా నియమించారు. ఈ సంస్థకు డైరెక్టర్‌‌గా ఒక తెలుగు వ్యక్తిని నియమించడం ఇదే మొదటిసారి. 

శ్రీనివాసరావు 1965 అక్టోబరు 4న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా అనిగండ్లపాడులో జన్మించారు. 1975-80 వరకు అనిగండ్లపాడు జిల్లా పరిషత్‌ పాఠశాలలో చదువుకున్న తర్వాత.. బాపట్ల వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చరల్ బీఎస్‌సీ పట్టా అందుకున్నారు. ఆతరువాత శ్రీనివాసరావు ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఎంఎస్‌సీ, పీహెచ్‌డీ పూర్తి చేశారు. దీని తరువాత ఇజ్రాయెల్ టెల్-అవివ్ విశ్వవిద్యాలయంలో పోస్ట్-డాక్టోరల్ చేశారు. చదువు అయ్యాక శ్రీనివాసరావు భారత్‌లోని పలు పరిశోధన సంస్థల్లో వివిధ హాదాల్లో పనిచేశారు.

Also Read: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అస్వస్థత ..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?

కాశ్మీర్ ఉగ్రదాడి భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది.అపార నష్టంతో కుమిలిపోతున్న మనం రగిలిపోతుంటే..పాకిస్తాన్ మాత్రం పొగరుతో కాలు దువ్వుతోంది. యుద్ధం తప్పదనే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే కనుక జరిగితే గెలుపెవరిది?ఎవరి బలం ఎంతుంది?

New Update
Indian Army

Indian Army

ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ లలో పరిస్థితి మారిపోయింది. ఒక్క ఉగ్రదాడితో రెండు దేశాలు అల్లకల్లోలం అయిపోయాయి. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. 26మందిని పోగొట్టుకుని భారత ప్రజలు రగిలిపోతున్నారు. ప్రభుత్వం కూడా దీనిని సీరియస్ గా తీసుకుంది. పాకిస్తాన్ మీద కస్సుబుస్సుమంటోంది. ఆ దేశాన్ని అన్ని విధాలా దిగ్భంధనం చేస్తూ ఐదు కఠిన నిర్ణయాలను తీసుకుంది. పోనీ అటు నుంచి పాకిస్తాన్ ఏమైనా తగ్గిందా అంటే..అదీ లేదు. ఆ దేశం కూడా యద్ధానికి సిద్ధం అంటూ కయ్యానికి కాలు దువ్వుతోంది. అసలు ఇదంతా జరగడానికి తామే కారణం అయినా కూడా ఆ విషయాన్ని ఒప్పుకోకుండా పొగరుగా మాట్లాడుతోంది. ఇండియా ఒక్కటేనా నిర్ణయాలు తీసుకోగలదు అంటూ వాళ్ళు కూడా సేమ్ టూ సేమ్ కాపీ కొట్టేశారు. దీంతో యుద్ధం తప్పదనే సూచనలు చాలా గట్టిగానే కనిపిస్తున్నాయి. దీని కోసం రెండు దేశాలూ సిద్ధమైపోతున్నాయి కూడా. భారత ఆర్మీ ఛీప్ రేపు కాశ్మీర్ కూడా వెళుతున్నారు. అక్కడ బలగాలు పర్యవేక్షించడంతో పాటూ ఇతర ఏర్పాట్లను కూడా చూడనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో యుద్ధమే కనుక జరిగితే ఏ దేశం గెలుస్తుంది...ఎవరి బలం ఎంత అనే చర్చలు జరుగుతున్నాయి. 

భారత్, పాక్ సైనిక బలాలు ఇవే..

ఇండియా, పాకిస్తాన్ ల మధ్య ఇదే మొదటిసారి కాదు. ఇలా దాడులు జరగడం...రెండు దేశాలు యుద్ధానికి రెడీ అవడం చాలాసార్లే జరిగింది. పాక్ చేసిన పనులకు భారత్ అన్ని సార్లూ గట్టిగానే జవాబు చెప్పింది. ఎప్పుడూ విజయం కూడా మనవైపే ఉంటుంది కూడా. అయితే ఈ సారి యుద్ధం జరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయి. ఎవరికి గెలిచే ఛాన్స్ ఉందంటే..కచ్చితంగా భారత్ కే అని చెప్పాలి. ఎందుకంటే అన్ని రకాలుగా పాకిస్తాన్ కంటే భారత్ బలంగా ఉంది. 

భారత ఆర్మీ సైనికులు...పాక్ ఆర్మీ సైనికుల కంటే దాదాపు రెండింతలు ఉన్నారు.  భారత సైనికులు 14, 55, 550 మంది ఉంటే పాక్ సైనికులు 6, 54,00 మంది ఉన్నారు.  ఇండియా దగ్గర ఆరు వైమానిక ట్యాంకర్లు ఉంటే పాక్ దగ్గర నాలుగు ఉన్నాయి. ఇక అణు జలాంతర్గాముల విషయానికి వస్తే భారత్ దగ్గర 2893 ఉన్నాయి. పాక్ దగ్గర 121 మాత్రమే ఉన్నాయి. గగనతలం సంగతి చూస్తే..ఇండియా దగ్గర 2,229 ఎయిర్ క్రాఫ్ట్స్, 513 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. అదే పాకిస్తాన్ దగ్గర 1, 399 ఎయిర్ క్రాఫ్ట్స్, 328 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. వీటన్నిటితో పాటూ భారత్ దగ్గర 1.15 మిలియన్ రిజర్వ్, 25 లక్షల పారా మిలటరీ బలగాలు అదనంగా ఉన్నాయి. 

ఆర్థిక బలం..

ఇవన్నీ ఒక ఎత్తైతే ఆర్థికంగా పాకిస్తాన్ కంటే భారత్ చాలా ఉన్నతంగా ఉంది. ఇప్పటికప్పుడు యుద్ధం వచ్చినా దాన్ని ఇండియా తట్టుకోగలదు. దానికి కావాల్సిన ఏర్పాట్లను వెంటనే చేయగలదు. ప్రపంచ దేశాలు కూడా భారత్ కు సహాయం చేయడానికి ముందుకు వస్తాయి. ముఖ్యంగా పెద్దన్న అమెరికా అందరి కంటే ఈ విషయంలో ముందుంటుంది. కానీ మరి పాకిస్తాన్ సంగతేంటి. ఆ దేశం చాలా రోజులుగా ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది. తినడానికి తిండి కూడా లేకుండా బాధలు పడుతోంది. ఇలాంటి సమయంలో ఆ దేశం ఫుల్ ఎఫెర్ట్ పెట్టి యుద్ధం చేయగలదా...ఒకవేళ చేసినా...యుద్ధం ముగిశాక వచ్చే పరిసనామాలను తట్టుకోగలదా అనే చాలా పెద్ద ప్రశ్నే. పైగా ప్రపంచ దేశాలు పాకిస్తాన్ కు ఏ విధంగానూ సహాయం చేయవు. ఆఖరుకి కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత తాలిబాన్లు కూడా భారత్ కు సపోర్టు చేశారు. పాక్ చేసింది తప్పు అంటూ మాట్లాడారు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ యుద్ధం అంటూ ఎగదోయడం సరైన విషయం కాదు. దీన్ని ఆ దేశం ఎంత త్వరగా తెలుసుకుంటే...దానికి అంత మంచిది. 

 today-latest-news-in-telugu | india | pakistan | war | army

Advertisment
Advertisment
Advertisment