/rtv/media/media_files/2026/03/24/supreme-court-2026-03-24-14-50-27.jpg)
Women military officers entitled to Permanent Commission, says Supreme Court
సెక్స్ వర్కర్ల హక్కుల విషయంలో సుప్రీంకోర్టు తాజాగా చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ తీర్పులో.. స్వచ్ఛందంగా సెక్స్ వర్క్ చేసుకునేవారిని నేరస్తుల్లా చూడకూడదని కోర్టు స్పష్టం చేసింది. అలాంటి వారిపై పోలీసులు దాడులు చేయడం, కేసులు పెట్టడం చట్టవిరుద్ధమని తేల్చి చెప్పింది. అయితే మహిళలు, చిన్న పిల్లలను బలవంతంగా ఈ రొంపిలోకి నెట్టే మానవ అక్రమ రవాణా ముఠాలపై మాత్రం ఉక్కుపాదం మోపాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
సెక్స్ వర్కర్ల హక్కులు, వారి పునరావాసం, పోలీసుల ప్రవర్తనపై దాఖలైన పిటిషన్లను జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు నేతృత్వంలోని బెంచ్ విచారించింది. ఈ క్రమంలో కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికి గౌరవంగా జీవించే హక్కును ఇచ్చిందని, ఆ హక్కులు సెక్స్ వర్కర్లకు కూడా వర్తిస్తాయని కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది.
ఈ కేసు విచారణ సమయంలో కోర్టు కీలక కామెంట్స్ చేసింది. ఈ వృత్తిని ఎంచుకున్న వారికి, మనుషుల అక్రమ రవాణా మాఫియా చేతిలో మోసపోయిన బాధితులకు చాలా తేడా ఉందని పేర్కొంది.అంతేకాకుండా ఎవరైనా ఓ మహిళ తన సొంత ఇష్టంతో సెక్స్ వర్క్ చేస్తోందని తెలిస్తే.. ఆమెను పోలీసులు వేధించకూడదని, పోలీస్ స్టేషన్‌కు తరలించడం లేదా క్రిమినల్ కేసులు పెట్టడం వంటివి చేయకూడదని ఆదేశించింది.
అలాగే, పోలీసులు నిర్వహించే రెస్క్యూ ఆపరేషన్ల సమయంలో సెక్స్ వర్కర్ల ఫొటోలు, వీడియోలు తీసి మీడియాకు ఇవ్వద్దని సుప్రీంకోర్టు వార్ని్ంగ్ ఇచ్చింది. వారి గుర్తింపును బయటపెట్టడం వల్ల వారి వ్యక్తిగత గౌరవానికి భంగం కలుగుతుందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. టీవీ ఛానళ్లు, పేపర్లు, మీడియా సంస్థలు కూడా బాధితుల వివరాలను లేదా ఫొటోలను ప్రసారం చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది.
అడ్రస్ ప్రూఫ్ లేకపోయినప్పటికీ
సెక్స్ వర్కర్లకు సరైన అడ్రస్ ప్రూఫ్ లేకపోయినప్పటికీ, వారికి వెంటనే ఆధార్ కార్డులు జారీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది. ఐడెంటిటీ కార్డులు లేకపోవడం వల్ల వారు వైద్య సేవలు, బ్యాంకింగ్, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది.
ఇక మానవ అక్రమ రవాణాపై మాత్రం ఎలాంటి జాలి చూపించొద్దని ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచించింది. ముఖ్యంగా మహిళలను, అమాయక పిల్లలను బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టే మాఫియా నెట్‌వర్క్‌లను పూర్తిగా అణచివేయాలని, ఈ రొంపి నుంచి బయటపడిన బాధితులకు మంచి పునరావాసం కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
Follow Us