Bangalore: బెంగళూరులో ట్రాఫిక్‌ జామ్‌..వాహనాలు వదిలేసి నడుచుకుంటూ!

కొన్ని రోజులుగా బెంగళూరును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.దీంతో విసుగు చెందిన కొందరు టెక్ ఉద్యోగులు.. తమ వాహనాలను వదిలేసి.. నడుచుకుంటూ ఇళ్లకు వెళ్లిపోయారు.

New Update
traffic 2

Bangalore: కర్ణాటక రాజధాని బెంగళూరు చాలా కాలం నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉంది. కొంతకాలం క్రితం వరకు వర్షాల వల్ల, మరికొంత కాలం ట్రాఫిక్‌ వల్ల ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. బెంగళూరులో పీక్ అవర్స్‌లో రోడ్లపై ప్రయాణించాలంటే నగరవాసులు నరకంలా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక బెంగళూరు ట్రాఫిక్‌లోనే బస్సు డ్రైవర్ భోజనం చేయడం, ఓ టెకీ ల్యాప్‌టాప్ పట్టుకుని వర్క్ చేసుకోవడం, ఓ మహిళ కూరగాయలు తరగడం.. ఇలా రకరకాల ఘటనలకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

 అయితే గత కొన్ని రోజులుగా బెంగళూరును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఇప్పటికే ట్రాఫిక్ బాధలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న బెంగళూరువాసులకు రోడ్లపై నిలిచిన వరదనీటితో మరింత కష్టాలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.దీంతో విసుగు చెందిన కొందరు టెక్ ఉద్యోగులు.. తమ వాహనాలను వదిలేసి.. నడుచుకుంటూ ఇళ్లకు వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Also Read: పెప్సీ, కోకా కోలా నుంచి ఇకపై బడ్జెట్ డ్రింక్స్.. కారణమేంటి?

వదిలేసి. కాళ్లకు పని...

బుధవారం సాయంత్రం బెంగళూరు నగరంలో భారీ వర్షం పడింది. ఈ నేపథ్యంలోనే నగరంలోని ఎలక్ట్రానిక్‌ సిటీ ఫ్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. వాహనాలు ముందుకు కదలకపోవడంతో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇక సాయంత్రం వేళ.. ఆఫీసుల నుంచి ఉద్యోగులు తిరిగి ఇళ్లకు వెళ్లే సమయం కావడం, భారీ వర్షం పడటం, సాధారణంగానే బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు.. ఇవన్నీ కలిసి నగరవాసులకు చుక్కలు కనిపించాయి. దాదాపు 3 గంటల పాటు వాహనాలు ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లై ఓవర్‌పైనే ఆగిపోయాయి. దీంతో విసుగు చెందిన టెక్ ఉద్యోగులు.. తమ కార్లను ఆ ట్రాఫిక్‌ లోనే వదిలేసి. కాళ్లకు పని చెప్పారు. 

Also Read: అమరావతికి కేంద్రం అదిరిపోయే శుభవార్త.. భారీగా నిధులు!

కార్లను అక్కడే వదిలేసి.. ఇంటి వరకు పాదయాత్రగా వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వానలకు బెంగళూరు నగరం పూర్తిగా అతలాకుతలం అయింది. నగరంలోని అనేక ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. పలు కాలనీల్లో వరద పోటెత్తడంతో.. రహదారులన్నీ నదులు తలపిస్తున్నాయి. దీంతో నగరంలో రాకపోకలు సాగించేందుకు బెంగళూరు వాసులు తీవ్ర అవస్థలు పడుతున్న సంగతి తెలిసిందే.

Also Read:  ఫ్రిడ్జ్‌లో ఇవి స్టోర్ చేసి తింటున్నారా? జాగ్రత్త

కొన్ని చోట్ల కార్లు మొత్తం నీట మునిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇక భారీ వర్షాలకు ఇప్పటివరకు బెంగళూరులో ఐదుగురు చనిపోయారు. బాబుసపల్య ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ భారీ భవనం కుప్పకూలిపోవడంతో అందులో పనిచేస్తున్న పలువురు కార్మికులు చనిపోగా.. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు.ఇక ఈ బెంగళూరు ట్రాఫిక్ పరిస్థితిని చెప్పేందుకు.. స్థానికులు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 

Also Read:  స్వార్థంతోనే.. షర్మిల లేఖపై జగన్ సంచలన రియాక్షన్!

Advertisment
Advertisment
తాజా కథనాలు