/rtv/media/media_files/2026/06/11/fotojet-4-2026-06-11-11-48-07.jpg)
భారత నౌకాదళాన్ని మరింత పటిష్టం చేసేందుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అకార్డ్ సాఫ్ట్‌వేర్ అండ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒక కీలక ఒప్పందంపై సంతకం చేసింది. దేశీయంగా తయారయ్యే 'ఎలక్ట్రానిక్ సిగ్నల్ జామర్లను' సరఫరా చేయడం కోసం ఈ ఒప్పందం కుదిరింది. దీని విలువ సుమారు రూ.449 కోట్లు. ఈ సాంకేతికత అందుబాటులోకి రావడం వల్ల మన నౌకాదళం సముద్రంలో ఎదురయ్యే శత్రువుల దాడులను మరింత సమర్థవంతంగా అడ్డుకోగలదు. ఈ ఒప్పందం ద్వారా భారత నౌకాదళానికి 'ఎకో-గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్' జామర్లను అందించనున్నారు.
"Strong move by MoD! ₹449 Cr for 20 indigenous Enhanced GNSS Jammers will give our Navy serious EW edge — blinding enemy drones, missiles & navigation in the IOR. Atmanirbhar in action. Electromagnetic dominance is the future of naval warfare.
— TheJoyConnection + (@Strategiceye127) June 10, 2026
ప్రస్తుతం మన దేశం 'ఆత్మనిర్భర్ భారత్'లో భాగంగా స్వదేశీ సాంకేతికతకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఈ జామర్లు పూర్తిగా దేశీయంగా తయారవుతుంది. ఈ జామర్ల ప్రధాన పనితీరు 'సిగ్నల్ స్పూఫింగ్'ను అడ్డుకోవడం. ఆధునిక యుద్ధ తంత్రంలో శాటిలైట్ సిగ్నల్స్ కీలక పాత్ర పోషిస్తాయి. శత్రువులు మన నౌకల నావిగేషన్ వ్యవస్థను తప్పుదారి పట్టించడానికి చేసే ప్రయత్నాలను ఈ జామర్లు సమర్థవంతంగా నిరోధిస్తాయి. అంటే శత్రువుల డ్రోన్లు లేదా క్షిపణులు తప్పుడు సంకేతాలతో మన నౌకలను టార్గెట్ చేయకుండా ఈ పరికరాలు రక్షణగా నిలుస్తాయి.
ఈ వ్యవస్థలను నౌకాదళంలోని యుద్ధ నౌకల్లో అమర్చడం ద్వారా సముద్ర గర్భంలో, ఉపరితలంపై నిఘా సామర్థ్యం పెరుగుతుంది. శత్రువుల నుంచి వచ్చే ఎలక్ట్రానిక్ దాడులను ఎదుర్కోవడంలో ఇది మన నౌకలకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. దీనివల్ల యుద్ధ పరిస్థితుల్లో లేదా నిఘా కార్యకలాపాల్లో మన నౌకలు మరింత సురక్షితంగా ఉండగలవు. రక్షణ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశీయ రక్షణ పరిశ్రమకు ప్రోత్సాహం లభిస్తుంది.
Follow Us